సూపర్ స్టార్ రజనీకాంత్( Superstar Rajinikanth ) గురించి మనందరికీ తెలిసిందే.రజినీకాంత్ తాజాగా నటించిన చిత్రం జైలర్.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అయితే రజనీకాంత్ పని అయిపోయింది సినిమాలకు గుడ్ బై చెప్పవచ్చు అనుకుంటున్న సమయంలో జైలర్ సినిమా( Jailer Movie )తో ప్రేక్షకులను పలకరించడంతో పాటు సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు.

70 ఏళ్ల వయసులో కూడా దాదాపు 600 కోట్లకు పైగా కలెక్షన్స్( Jailer Movie Collections ) ని సాధించి సూపర్ స్టార్ అనిపించుకున్నారు.అయితే ప్రస్తుతం రజనీ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ సంగతి అటు ఉంచితే.రజని సూపర్ స్టార్ కాకముందు ఎన్నో వ్యసనాలకు అలవాటు పడ్డారు.సిగరెట్లు తాగటం, మందు అమ్మాయిలు ఇలా విచ్చలవిడిగా జలసాలు చేసేవారట.ఎప్పుడు అయితే లతతో పెళ్లి జరిగిందో అప్పటినుంచి రాఘవేంద్ర స్వామి భక్తుడిగా మారిపోయాడు.
ఆ తర్వాత పూర్తి ఆధ్యాత్మిక బాట పట్టేశారు.ఆ తర్వాత సూపర్ స్టార్ డమ్ వచ్చాక రజనీకాంత్ జీవితం పూర్తిగా మారిపోయింది.

అన్ని అలవాట్లు వదిలేశారు.ఒక సౌమ్యుడిగా మారిపోయారు.అయితే రజని సూపర్ స్టార్ అయ్యాక ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.అప్పట్లో తమిళనాడును ఒక ఊపు ఊపేసిన ఒక స్టార్ హీరోయిన్( Star Heroine ) ఆర్థికంగా చిదిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతోంది.
ఆమె సాయం కోసం రజని ఇంటి గుమ్మం తొక్కి తాను పడుతున్న కష్టాలు తన బాధలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసిందట.వెంటనే రజిని ఆమెకు నాలుగు నోట్ల కట్టలు తీసి ఇచ్చి నీకు ఏ సాయం కావాలన్నా నేను ఉన్నాను నాకు చేతనైనంత సాయం చేస్తాను.
ఎలాంటి మొహమాటం లేకుండా రమ్మని చెప్పి పంపారట.అప్పట్లో ఆ విషయం కోలీవుడ్ లో పెద్ద సెన్సేషనల్ అయింది.ఆ హీరోయిన్ జెమినీ గణేషన్, శివాజీ గణేషన్, రజనీకాంత్, కమల్‌హాసన్ లాంటి స్టార్ హీరోల సరసన కొన్ని సినిమాలలో నటించింది.