వ్యవసాయంలో మెలుకువలు పాటిస్తేనే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.కాబట్టి ఏ పంటను సాగు చేయాలనుకున్న ముందుగా ఆ పంటపై పూర్తిగా అవగాహన ఉండాలి.
అలాకాకుండా సాగు చేస్తే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సిందే.మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండే పంటలలో కంది పంట( redgram crop ) కూడా ఒకటి.
కంది పంటలో మెలకువలు పాటించి సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించవచ్చు.ఈ కంది పంటకు చీడపీడల బెడద చాలా ఎక్కువ.
సకాలంలో గుర్తించి తొలిదశలోనే అరికట్టాలి.అప్పుడే దిగుబడి బాగా పొందవచ్చు.
కంది పంట వేయడానికి ముందు వేసవికాలంలో లోతు దిక్కులు దున్నుకోవాలి.ఆ తర్వాత పొలంలో పంటకు సంబంధించిన అవశేషాలు ఏమైనా ఉంటే మొత్తం శుభ్రం చేయాలి. సేంద్రియ ఎరువులకు( organic fertilizers ) అధిక ప్రాధాన్యం ఇచ్చి ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు వేసి కలియ దున్నుకోవాలి.మార్కెట్లో దొరికే తెగులు నిరోధక విత్తనాలను( Pest resistant seeds ) మాత్రమే ఎంపిక చేసుకొని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతనే పొలంలో విత్తుకోవాలి.
మొక్కల మధ్య, మొక్కల సాళ్ల మధ్య సూర్యరశ్మి, గాలి బాగా తగిలే విధంగా నాటుకుంటే మొక్క ఆరోగ్యకరంగా పెరగడానికి అవకాశం ఉంటుంది.
కంది పంట ఎదుగుదల దశలో ఉన్నప్పుడు ఆకు గూడు పురుగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఈ పురుగులను తొలి దశలోనే అరికట్టాలి.పూత దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆశిస్తే ఇక తీవ్ర నష్టమే.
లార్వాలు చిగురాకులను, ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను తినడం ప్రారంభిస్తాయి.పూత, లేత కాయలను తొలచి తింటాయి.
అధిక వర్షపాతం ఉన్న సమయంలో ఈ పురుగులు పంటను ఆశించే అవకాశం ఉంది.ఈ పురుగులను పంట పొలంలో గుర్తించిన వెంటనే క్వినాల్ ఫాస్ 25శాతం 2.0 ఇ.సి 2.0మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 36శాతం యస్.యల్ 1.6మి.లీ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.