కందిపంటను ఆశించే ఆకుగూడు పురుగులను నివారించేందుకు సస్యరక్షక పద్ధతులు..!

వ్యవసాయంలో మెలుకువలు పాటిస్తేనే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.కాబట్టి ఏ పంటను సాగు చేయాలనుకున్న ముందుగా ఆ పంటపై పూర్తిగా అవగాహన ఉండాలి.

అలాకాకుండా సాగు చేస్తే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సిందే.మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండే పంటలలో కంది పంట( Redgram Crop ) కూడా ఒకటి.

కంది పంటలో మెలకువలు పాటించి సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించవచ్చు.

ఈ కంది పంటకు చీడపీడల బెడద చాలా ఎక్కువ.సకాలంలో గుర్తించి తొలిదశలోనే అరికట్టాలి.

అప్పుడే దిగుబడి బాగా పొందవచ్చు. """/" / కంది పంట వేయడానికి ముందు వేసవికాలంలో లోతు దిక్కులు దున్నుకోవాలి.

ఆ తర్వాత పొలంలో పంటకు సంబంధించిన అవశేషాలు ఏమైనా ఉంటే మొత్తం శుభ్రం చేయాలి.

సేంద్రియ ఎరువులకు( Organic Fertilizers ) అధిక ప్రాధాన్యం ఇచ్చి ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు వేసి కలియ దున్నుకోవాలి.

మార్కెట్లో దొరికే తెగులు నిరోధక విత్తనాలను( Pest Resistant Seeds ) మాత్రమే ఎంపిక చేసుకొని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతనే పొలంలో విత్తుకోవాలి.

మొక్కల మధ్య, మొక్కల సాళ్ల మధ్య సూర్యరశ్మి, గాలి బాగా తగిలే విధంగా నాటుకుంటే మొక్క ఆరోగ్యకరంగా పెరగడానికి అవకాశం ఉంటుంది.

"""/" / కంది పంట ఎదుగుదల దశలో ఉన్నప్పుడు ఆకు గూడు పురుగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.

ఈ పురుగులను తొలి దశలోనే అరికట్టాలి.పూత దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆశిస్తే ఇక తీవ్ర నష్టమే.

లార్వాలు చిగురాకులను, ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను తినడం ప్రారంభిస్తాయి.

పూత, లేత కాయలను తొలచి తింటాయి.అధిక వర్షపాతం ఉన్న సమయంలో ఈ పురుగులు పంటను ఆశించే అవకాశం ఉంది.

ఈ పురుగులను పంట పొలంలో గుర్తించిన వెంటనే క్వినాల్ ఫాస్ 25శాతం 2.

0 ఇ.సి 2.

0మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 36శాతం యస్.

యల్ 1.6మి.

లీ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఆ స్టార్ డైరెక్టర్ కు ఒకేసారి షాకిచ్చిన చిరంజీవి, బాలయ్య.. ఏం జరిగిందంటే?