అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్‌' ఏయ్ బిడ్డ పాటకు సూపర్ రెస్పాన్స్..

అల వైకుఠ‌పురంలో’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.

 Super Response For Allu Arjun Pushpa The Rise Eyy Bidda Song Details, Super Resp-TeluguStop.com

ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది.ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్.

ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది.వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే నాలుగో సింగిల్‌ విడుదలైంది.విడుదలైన మరుక్షణం నుంచి ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది.ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

ఈ పక్క నాదే.ఆ పక్క నాదే.తలపైన ఆకాశం ముక్క నాదే.ఆ తప్పు నేనే.

ఈ ఒప్పు నేనే.తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే.

నన్నయితే కొట్టేటోడు భూమ్మీదే పుట్టలేదు.పుట్టాడా అది మళ్ళా నేనే.

నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.ఎవడంటే అది రేపటి నేనే.

నే తిప్పానా మీసమట.సేతిలోన గొడ్డలట.

సెసిందే యుద్దమాట.సేయందే సంధి అటా…

Telugu Allu Arjun, Sukumar, Eyy Bidda, Pushpa Latest, Pushpa, Samantha-Movie

ఏయ్ బిడ్డా.ఇది నా అడ్డా.(4)

నిను ఏట్లో ఇసిరేస్తా.నే సేపతో తిరిగొస్తా.గడ కర్రకు గుచ్చేస్తా.నే జెండాలా ఎగరేస్తా.నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా.

ఖరీదైన ఖనిజంలా మళ్లీ నేను దొరికేస్తా.

ఏయ్ బిడ్డా.ఇది నా అడ్డా.(4)

ఎవడ్రా ఎవడ్రా నువ్వు.ఇనుమును ఇనుమును నేను.నను కాల్చితే కత్తి అవుతాను.ఎవడ్రా ఎవడ్రా నువ్వు.మట్టిని మట్టిని నేను.

నను తొక్కితే ఇటుకవుతాను.ఎవడ్రా ఎవడ్రా నువ్వు.

రాయిని రాయిని నేను.గాయం కానీ చేశారంటే ఖాయంగా దేవుడిని అవుతాను.

Telugu Allu Arjun, Sukumar, Eyy Bidda, Pushpa Latest, Pushpa, Samantha-Movie

ఏయ్ బిడ్డా.ఇది నా అడ్డా.(4)

నటీనటలు:

అల్లు అర్జున్, రష్మిక మందన్న, సమంత (స్పెషల్ సాంగ్), ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు.

టెక్నికల్ టీం:

దర్శకుడు: సుకుమార్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్, కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా, సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: S.రామకృష్ణ – మోనిక నిగొత్రే, సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్, లిరిసిస్ట్: చంద్రబోస్, క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్, మేకప్: నాని భారతి, CEO: చెర్రీ, కో డైరెక్టర్: విష్ణు, లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం, బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా, PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube