వైరల్ వీడియో: రెండు ఎలుగుబంట్ల మధ్య భీకర పోరు.. చివరికి ఏమైందో తెలిస్తే..!

సాధారణంగా అడవిలో జంతువులు పొట్లాటకు దిగితే.అక్కడి వాతావరణం భీతి గొల్పుతుంది.

 Viral Video Fierce Fight Between Two Bears If You Know What Happened In The End-TeluguStop.com

ఇక సింహం, పులి, ఎలుగుబంటి, ఖడ్గమృగం వంటి పెద్ద జంతువులు ఒకదానితో ఒకటి పోట్లాడితే.ఆ దృశ్యాలు ఒంట్లో వణుకు పుట్టిస్తాయి.

వాటికి సమీపంలో ఉన్న చిన్న జంతువులు భయంతో ఉరుకులు పరుగులు తీస్తుంటాయి.వాటి మధ్య జరుగుతున్న భీకర పోరు చూసి పక్షుల భయంతో వేరే ప్రాంతాలకు ఎగిరిపోతుంటాయి.

బిగ్గరగా అరుస్తూ అత్యంత ఘోరంగా, క్రూరంగా కొట్లాటకు తెగబడే ఈ జంతువుల దృశ్యాలు ఫోన్లలో చూసినా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.అయితే తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

దీనిని నేచర్ 27_12 అనే ఇన్ స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసింది.దాదాపు నాలుగువేల లైక్ లతో ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో దాదాపు ఐదు వందల కిలోల ఉండే రెండు భారీ ఎలుగుబంట్లు భీకర యుద్ధంలోకి దిగడం చూడొచ్చు.చెవులు చిల్లులు పడేలా.నలుదిక్కులూ దద్దరిల్లేలా అరుస్తూ ఈ రెండు జంతువులు ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి.బొక్కలు విరిగేంత బలంతో పంచులు విసురుతూ.

నోటితో కరుస్తూ.నేలపై దొర్లుతూ ఒక యూ.ఎఫ్.సి మ్యాచ్ ని తలపించాయి ఈ క్రూర జంతువులు.భారీకాయంతో మల్ల యుద్ధం చేసిన ఈ రెండు జంతువులు అలిసిపోయి చివరికి దేని దారిన అవి వెళ్ళిపోయాయి.పైకి ఎలాంటి గాయాలు కనిపించకపోయినా.రెండింటికీ బాగానే దెబ్బలు తగిలాయని తెలుస్తోంది.

ఏదేమైనప్పటికీ ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇదే భీకర పోరు మన కళ్లముందు జరిగితే ఎంత భయపడిపోతామో అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.ఈ రెండు జంతువుల మధ్య సింహం లేదా పులి వెళ్లినట్లయితే అవి నుజ్జునుజ్జు అయ్యి ఉండేవి అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube