రెండో రోజు ఈడీ కస్టడీకి ఎంబీఎస్ జువెల్స్ అధినేత సుఖేశ్ గుప్తా

ఎంబీఎస్ జువెల్స్ అధినేత సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు రెండో రోజు కస్టడీకి తీసుకోనున్నారు.ఈ క్రమంలో సుఖేశ్ గుప్తా బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

 Sukhesh Gupta, Head Of Mbs Jewels, Was Taken Into Ed Custody On The Second Day-TeluguStop.com

అదేవిధంగా ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఎగవేతపై కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.కాగా ఆయనపై రూ.614 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో విచారణ నిమిత్తం సుఖేశ్ గుప్తాను ఈడీ కోర్టు తొమ్మిది రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది.

దీనిలో భాగంగా నవంబర్ 2వ తేదీ వరకు సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు విచారించనున్నారు.తొలిరోజు సైతం సుఖేశ్ గుప్తాను ఈడీ సుదీర్ఘంగా విచారించింది.ఎంఎంటీసీ సంస్థ నుంచి కొనుగోలు చేసిన బంగారం అమ్మకాలు జరిపిన డబ్బులు ఎక్కడికి తరలించారని అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.గతంలో రెండు రోజుల పాటు సోదాలు చేపట్టిన ఈడీ సుమారు రూ.150 కోట్ల బంగారపు ఆభరణాలను, రూ.2 కోట్ల నగదును సీజ్ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube