రెండో రోజు ఈడీ కస్టడీకి ఎంబీఎస్ జువెల్స్ అధినేత సుఖేశ్ గుప్తా
TeluguStop.com
ఎంబీఎస్ జువెల్స్ అధినేత సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు రెండో రోజు కస్టడీకి తీసుకోనున్నారు.
ఈ క్రమంలో సుఖేశ్ గుప్తా బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.అదేవిధంగా ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఎగవేతపై కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.
కాగా ఆయనపై రూ.614 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో విచారణ నిమిత్తం సుఖేశ్ గుప్తాను ఈడీ కోర్టు తొమ్మిది రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది.
దీనిలో భాగంగా నవంబర్ 2వ తేదీ వరకు సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు విచారించనున్నారు.
తొలిరోజు సైతం సుఖేశ్ గుప్తాను ఈడీ సుదీర్ఘంగా విచారించింది.ఎంఎంటీసీ సంస్థ నుంచి కొనుగోలు చేసిన బంగారం అమ్మకాలు జరిపిన డబ్బులు ఎక్కడికి తరలించారని అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
గతంలో రెండు రోజుల పాటు సోదాలు చేపట్టిన ఈడీ సుమారు రూ.150 కోట్ల బంగారపు ఆభరణాలను, రూ.
2 కోట్ల నగదును సీజ్ చేసిన విషయం తెలిసిందే.
బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ… స్వీట్ బ్రదర్ అంటూ ఫిదా అయిన బన్నీ!