తెలుగు సినిమాలు ఇది వరకు థియేటర్స్ వద్ద ప్రతీ శుక్రవారం సందడి చేస్తూ ఉండేవి.ఇక కరోనా తర్వాత థియేటర్స్ లో ఎలా ప్రతీ వారం సినిమాలు రిలీజ్ అవుతున్నాయో.
అలాగే ఈ మధ్య ఓటిటిలో కూడా ప్రతీ వారం కొత్త సినిమాల సందడి స్టార్ట్ అవుతుంది.థియేటర్స్ లో ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో.
అలాగే ఓటిటిలో కూడా ప్రేక్షకులు కొత్త సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇలా ప్రతీ శుక్రవారం ఓటిటి ప్లాట్ ఫార్మ్ మీద కొత్త సినిమాల సందడి బాగా కనిపిస్తుంది.
ప్రేక్షకులు కూడా ఈ వారం ఏమేమి సినిమాలు రిలీజ్ అవుతాయో అని ఎదురు చేస్తున్నారు.మరి ఈ వారం కూడా శుక్రవారం రోజు కొత్త సినిమాలు ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయి.
సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవ్వనున్నాయి.
ది ఘోస్ట్.
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.థియేట్రికల్ రిలీజ్ లో యావేరేజ్ టాక్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ కూడా చాలా తక్కువ రాబట్టింది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ది ఘోస్ట్ ఓటిటిలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

అలాగే తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఝాన్సీ వెబ్ సిరీస్ కూడా ఈ వారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనే రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే ఈమె ఈ వెబ్ సిరీస్ ను ప్రోమోట్ చేస్తుంది.ఈ క్రమంలోనే ప్రొమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ 6 లోకి కూడా వచ్చి ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు పెంచేసింది.
ఈ రెండింటితో పాటు హిందీ, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.







