జబర్దస్త్ షోను అభిమానించే ప్రేక్షకులకు పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కిడ్నీ సంబంధిత సమస్యలతో పంచ్ ప్రసాద్ బాధ పడుతున్న సమయంలో జబర్దస్త్ జడ్జీలతో పాటు కొంతమంది కమెడియన్లు సహాయం చేయడం వల్ల పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్యల నుంచి కోలుకోవడం జరిగింది.
ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే పలు షోలతో పంచ్ ప్రసాద్ బిజీగా ఉన్నారు.
తనపై ఎవరైనా పంచ్ లు వేసినా పంచ్ ప్రసాద్ స్పోర్టివ్ గా తీసుకుంటారనే సంగతి తెలిసిందే.
జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన మరో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ పంచ్ ప్రసాద్ కు రెండో పెళ్లి అనే థంబ్ నైల్ తో ఉన్న పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఇమ్మాన్యుయేల్ పోస్ట్ తో పంచ్ ప్రసాద్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా అనే చర్చ జోరుగా జరుగుతోంది.
అయితే వాస్తవం ఏంటంటే కొన్నిరోజుల క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పంచ్ ప్రసాద్ కు అతని భార్యకు మళ్లీ పెళ్లి జరిగింది.అయితే ఆ విషయాన్ని ఇమ్మాన్యుయేల్ మరో విధంగా చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.
మరోవైపు జబర్దస్త్ షో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.పంచ్ ప్రసాద్ కు రోజురోజుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

పంచ్ ప్రసాద్ ఈటీవీ షోల ద్వారా నెలకు 3.5 లక్షల రూపాయల రేంజ్ లో సంపాదిస్తున్నారని సమాచారం అందుతోంది.ఈ రేంజ్ లో డబ్బు సంపాదిస్తున్న అతికొద్ది మందిలో పంచ్ ప్రసాద్ ఒకరు కావడం గమనార్హం.పంచ్ ప్రసాద్ కెరీర్ లో మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పంచ్ ప్రసాద్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.







