చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే వెల్లుల్లితో ఇలా చేస్తే ఒక్క దెబ్బకే మాయం!

చుండ్రు( Dandruff ) స్త్రీలే కాదు పురుషుల్లోనూ ఎందరో దీనికి బాధితులుగా ఉన్నారు.చుండ్రు చిన్న సమస్యగానే కనిపించిన తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.

 Garlic Helps To Get Rid Of Dandruff Effectively!, Garlic, Dandruff, Latest News,-TeluguStop.com

చుండ్రు కారణంగా తలలో విపరీతమైన దురద కలుగుతుంది.అలాగే జుట్టు రాలడం, పొడిగా మారిపోవడం జరుగుతుంది.

చుండ్రు వ‌ల్ల మొటిమలు కూడా వస్తుంటాయి.అందుకే చుండ్రును నివారించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే వెల్లుల్లితో చాలా సులభంగా చుండ్రును పోగొట్టుకోవచ్చు.

Telugu Dandruff, Dandruffremoval, Garlic, Care, Care Tips, Latest-Telugu Health

చుండ్రును నివారించగల సామర్థ్యం వెల్లుల్లికి( Garlic ) దండిగా ఉంది.మరి ఇంతకీ వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా పది వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి.ఆయిల్ హీట్ అవ్వడానికి ముందే వెల్లుల్లి తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి( Cloves Powder ), నాలుగు రెబ్బలు కరివేపాకు వేసి చిన్న మంటపై ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తలస్నానం చేయాలి.

Telugu Dandruff, Dandruffremoval, Garlic, Care, Care Tips, Latest-Telugu Health

ఇలా చేస్తే చుండ్రు దెబ్బకు మాయం అవుతుంది.చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ రెమెడీతో సులభంగా బయటపడొచ్చు.పైగా ఈ రెమెడీని పాటిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.తెల్ల జుట్టు( Grey Hair ) త్వరగా రాకుండా సైతం ఉంటుంది.కాబట్టి చుండ్రు సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్న వారు తప్పకుండా వెల్లుల్లితో పైన చెప్పిన విధంగా చేయండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube