Prabhas : ప్రభాస్ గ్రేట్ ప్రభాసే గ్రేట్.. ఈ హీరో పేరుపై ఏకంగా అన్ని కోట్ల బిజినెస్ జరుగుతోందా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Hero Prabhas 0గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

 4 Thousand Crore Business Happens In The Name Of Prabhas-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఆదిపురుష్, సలార్ సినిమాలు( Salaar ) షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.అయితే ఈ సినిమాలతో రూ.4 వేల కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu Salaar, Crore, Adipurush, Prabhas, Project, Tollywood-Movie

డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) దర్శకత్వంలో రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా ఆదిపురుష్.ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.మంచి హిట్ టాక్ ని కూడా సొంతం చేసుకుంది.ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది.రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే కనుక రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకూ బిజినెస్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.తాజాగా విడుదల అయిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్( Prashant Neel ) దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా రూ.800 నుంచి రూ.1000 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Telugu Salaar, Crore, Adipurush, Prabhas, Project, Tollywood-Movie

మరోవైపు ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ ప్రాజెక్ట్ కే.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్లు.పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.ఈ సినిమాకి రూ.2 వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.అలాగే ఈ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఒకటి ఉంది.రూ.200 నుంచి రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రూ.500 కోట్ల బిజినెస్( 500 Crore Business ) చేస్తుందని అంచనా వేస్తున్నారు.ఇలా నాలుగు సినిమాలతో ప్రభాస్ పేరు చెప్పుకుని రూ.4 వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube