Prabhas : ప్రభాస్ గ్రేట్ ప్రభాసే గ్రేట్.. ఈ హీరో పేరుపై ఏకంగా అన్ని కోట్ల బిజినెస్ జరుగుతోందా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Hero Prabhas 0గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఆదిపురుష్, సలార్ సినిమాలు( Salaar ) షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

అయితే ఈ సినిమాలతో రూ.4 వేల కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

"""/"/ డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) దర్శకత్వంలో రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా ఆదిపురుష్.

ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.మంచి హిట్ టాక్ ని కూడా సొంతం చేసుకుంది.

ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది.

రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే కనుక రూ.

800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకూ బిజినెస్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తాజాగా విడుదల అయిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్( Prashant Neel ) దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా రూ.

800 నుంచి రూ.1000 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

"""/"/ మరోవైపు ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ ప్రాజెక్ట్ కే.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్లు.

పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఈ సినిమాకి రూ.2 వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

అలాగే ఈ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఒకటి ఉంది.

రూ.200 నుంచి రూ.

300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రూ.500 కోట్ల బిజినెస్( 500 Crore Business ) చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇలా నాలుగు సినిమాలతో ప్రభాస్ పేరు చెప్పుకుని రూ.4 వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

మోక్షజ్ఞ మొదటి సినిమా డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది…బాలయ్య ప్లానింగ్ సూపర్…