స్టార్ హీరోయిన్ ప్రణీత తెలుగులో స్టార్ హీరోలకు జోడీగా నటించినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయారు.కొన్నిరోజుల క్రితం కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
ప్రతిభతో పాటు మానవత్వం ఉన్న హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పునీత్ చదివిస్తున్న పిల్లలకు సంబంధించిన బాధ్యతను హీరో విశాల్ ఏడాది పాటు తీసుకున్నారు.
మరోవైపు కన్నడ నటి ప్రణీతా సుభాష్ ఫ్రీగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ మంచి మనస్సును చాటుకున్నారు.ఈ నెల 3వ తేదీన బెంగళూరు నగరంలోని అంబేద్కర్ భవనంలో ప్రణీతా సుభాష్ మెడికల్ క్యాంప్ ను నిర్వహించారు.ఈ మెడికల్ క్యాంప్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎవరైనా ఫ్రీగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు.
ప్రణీత గతంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.
ప్రణీత సోషల్ మీడియాలో మెడికల్ క్యాంప్ వివరాలను పంచుకోవడంతో పాటు అప్పూ సార్ పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతోమందికి సహాయం చేశారని చెప్పుకొచ్చారు.ఎంతోమంది వైద్యానికి సంబంధించిన ఖర్చులతో పాటు విద్యకు సంబంధించిన ఖర్చులను పునీత్ రాజ్ కుమార్ భరించారని ప్రణీత కామెంట్లు చేశారు.
పునీత్ రాజ్ కుమార్ ఈ పనులతో పాటు ఎన్నో మంచి పనులను చేశారని ప్రణీత చెప్పుకొచ్చారు.పునీత్ రాజ్ కుమార్ అడుగుజాడలలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని ప్రణీత పేర్కొన్నారు.ప్రణీత తీసుకుంటున్న నిర్ణయాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
పేద ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ప్రణీత నిర్ణయాలు ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.