మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ వెనుక అసలు నిజం ఇదే?

నిన్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే.ప్రధానంగా టికెట్ రేట్ల గురించి చిరంజీవి చర్చించిన సంగతి తెలిసిందే.

 Star Hero Megastar Chiranjeevi Comments About  Rajyasabha Offer Details, Megasta-TeluguStop.com

ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని సమాచారం.కొన్నేళ్ల క్రితం వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

జనసేన పార్టీకి మద్దతు ఇవ్వడానికి సైతం చిరంజీవి ఇష్టపడటం లేదు.

అయితే సీఎం జగన్ నిన్న జరిగిన సమావేశంలో చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని చిరంజీవి ఆలోచించుకుని చెబుతానని అన్నారని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి చిరంజీవి వెంటనే స్పందించి ఆ వార్తలకు చెక్ పెట్టారు.తనకు సీఎం జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

తన గురించి అసత్య ప్రచారం జరగకుండా చిరంజీవి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలు ఇక్కడితో ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.

Telugu Acharya, Ap Cm Jagan, Bhola Shankar, Chiranjeevi, Cm Jagan, God, Multirer

వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి 2025 సంవత్సరం వరకు బిజీగా ఉన్నారు.ఏడాదికి రెండు కుదిరితే మూడు సినిమాల షూటింగ్ పూర్తయ్యేలా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Telugu Acharya, Ap Cm Jagan, Bhola Shankar, Chiranjeevi, Cm Jagan, God, Multirer

గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది.చిరంజీవి సినిమాలన్నీ 80 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.ప్రతి సినిమాలో ప్రత్యేకత ఉండే విధంగా చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.మల్టీస్టారర్ సినిమాలపై కూడా చిరంజీవి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.ఈ ఏడాది చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో పాటు మరో సినిమా రిలీజయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube