ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప‘ ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలుసు.ఈ సినిమాతో సుకుమార్ మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సినిమాతో తనని తాను మరోసారి నిరూపించు కున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈయన దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా రికార్డులను సాధించింది.బాలీవుడ్ లో సైతం ఈ సినిమా 100 కోట్ల మార్క్ టచ్ చేసి అందరిని ఆశ్చర్య పరిచింది.ఈ కలెక్షన్స్ హిందీ ట్రేడ్ మార్కెట్ వాళ్ళను కూడా విస్మయానికి గురి చేసింది.
ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2 మీద తన ధ్యాస మొత్తం పెట్టేసాడు.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగు తున్నాయి.
ఈ సినిమా పార్ట్ 1 భారీ హిట్ అవ్వడంతో పార్ట్ 2 మీద అందరి ద్రుష్టి పడింది.ఆ అంచనాలను అందుకోవడానికి సుకుమార్ చాలా కష్టపడుతున్నాడు.స్క్రిప్ట్ ఎలిమెంట్ లను సరికొత్తగా రూపొందిస్తున్నారు.ఇటీవలే పూర్తి చేసిన వర్షన్ తనకు నచ్చకపోవడంతో దానిని పక్కన పెట్టి ఫ్రెష్ వర్షన్ రాయడం కోసం సుకుమార్ యుఎస్ వెళ్లినట్టు తెలుస్తుంది.

అక్కడ రిసార్ట్స్ లో ప్రత్యేకంగా పుష్ప 2 స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ ను పూర్తి చేయబోతున్నాడని తెలుస్తుంది.ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి మరీ ఎవ్వరికి అందుబాటులో లేకుండా తన పని మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.కెజిఎఫ్ 2 భారీ విజయం సాధించడంతో ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని పుష్ప 2కోసం భారీ మార్పులు చేసి అల్లు అర్జున్ ను మరింత స్ట్రాంగ్ గా చూపించాలని ఫిక్స్ అయ్యారట.చూడాలి మరి స్క్రిప్ట్ లో ఎన్ని మార్పులు చేసి పుష్ప 2 ను తెరకెక్కిస్తాడో.