సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )నుండి సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ లో ఒకలాంటి క్రేజ్ అయితే ఉంటుంది.ఈయన కొత్తగా చేస్తున్న సినిమా నుండి అప్డేట్ కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తుంటారు.
మరి టాలీవుడ్ లో ప్రజెంట్ తెరకెక్కుతున్న పలు క్రేజీ కాంబోల్లో మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఒకటి.ఈ కాంబోలో ప్రస్తుతం హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతుంది.
SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.
ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో త్రివిక్రమ్( Trivikram ) ఈ సినిమాను ప్లాన్ చేసారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ విషయంలో గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో నుండి ఇంట్రెస్టింగ్ టాక్స్ వినిపిస్తుండగా తాజాగా ఈ సినిమా టైటిల్ ఏంటి అనే చర్చ జరుగుతుంది.అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఒక రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారట.ఈ రెండు టైటిల్స్ పై మహేష్ ఆసక్తిగా ఉన్నారని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.
ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ కానీ లేకపోతే ఊరికి మొనగాడు టైటిల్ కానీ బాగుటుంది అని మేకర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా పాజిటివ్ గా ఉన్నారు.దీంతో ఈ రెండు టైటిల్స్ లో ఒకదానిని పెట్టబోతున్నారు అని తెలుస్తుంది.ఇది గుంటూరు నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో ”గుంటూరు కారం” అనే టైటిల్ నే పెట్టె అవకాశం ఉందట.
మరి ఈ నెల 31న కృష్ణ( Krishna ) గారి జయంతి సందర్భంగా ఈ సినిమా నుండి టైటిల్ రాబోతుంది అని తెలుస్తుంది.అప్పటి వరకు ఎదురు చుస్తే ఈ టైటిల్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.