Smart Dog : పెద్ద అగ్ని ప్రమాదాన్ని అడ్డుకున్న కుక్క.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు..

సాధారణంగా చాలామంది తమ ఇళ్లలో కుక్కలను( Dogs) పెంచుకుంటారు.వాటిని ఇంట్లో మనిషిలా చూస్తుంటారు.

 Smart Dog Prevents Major Fire After Scooter Charger Catches Fire-TeluguStop.com

నిజానికి కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో మనం రోజూ చూస్తూనే ఉంటాం.తన యజమాని ఇంటికి నిత్యం కాపలా కాస్తూ, ఆపద సమయంలో అవసరమైతే తమ ప్రాణాలు కూడా ఫణంగా పెడుతుంటాయి.

పెంపుడు కుక్కల కారణంగా పెద్ద ప్రమాదాలు తృటిలో తప్పిపోయిన సందర్భాలను చాలానే ఉన్నాయి.ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియా( Social Media )లో తెగ వైరల్ అవుతుంటాయి.

తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.వీడియో చుసిన నేటిజనులు కుక్క తెలివితేటలకు చప్పట్లు కొడుతున్నారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్( Viral Video ) అవుతున్న వీడియోని మనం గమనించినట్లయితే ఓ ఇంట్లో ఎవరూ లేరు.ఆ ఇంటి పెంపుడు కుక్క ఒక్కటే బయట పడుకొని ఉంది.అదే సమయలో దానికి ఎదురుగా ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్( Electric Bike Charging ) అవుతుంటుంది.ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఛార్జింగ్ వైరు దగ్గర బ్యాటరీలో మంటలు రావడం మొదలయ్యాయి.

దీన్ని గమనించిన కుక్క ఎవరైన వస్తారేమో అని అటూ ఇటూ చూస్తుంది.కానీ ఎవరూ రాకపోవడంతో, మంటలు( Fire ) కూడా తగ్గకపోవడంతో వెంటనే అలెర్ట్ అవుతుంది.

పరుగుపరుగున అక్కడికి వెళ్లి కాలిపోతున్న బ్యాటరీ వైరును నోటితో పట్టుకుని దూరంగా లాగుతుంది.ఇలా అటూ ఇటూ లాగడంతో చివరకు మంటలు ఆరిపోతాయి.

ఇక మంటలు ఆరిపోవడం గమనించిన కుక్క అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది.అంతటితో ఆగకుండా తన యజమానికి వినిపించేలా మొరుగుతూ హెచ్చరిస్తుంది.ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్లు( Nettizens ) వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.కొందరేమో ‘ఈ కుక్క స్మార్ట్నెస్ చూస్తే ఆశ్చర్య కలుగుతోంది’ అని అంటుంటే మరికొందరేమో ‘మనుషులకంటే కుక్కలే నయం’ అని అంటున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం 20 వేలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది.ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా వీడియో పై ఒక లుక్ వేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube