Dog Viral Video : పిల్లకు లైఫ్ లెసన్ నేర్పిస్తున్న తల్లి కుక్క.. వీడియో వైరల్..

మనుషులు మాత్రమే కాదు జంతువులు( Animals ) కూడా తమ పిల్లలకు జీవిత పాఠాలు నేర్పిస్తాయి.ఈ ప్రపంచంలో అడుగు పెట్టాక ఎలా బతకాలి? ఎలా ప్రమాదాల నుంచి తప్పించుకోవాలి? అనే లైఫ్ లైసెన్స్ అవి అను నిత్యం చూపిస్తాయి.లేకపోతే పిల్లలు అడవిలోనైనా లేదంటే జనావాసాల్లో పెరిగేవైనా బతకడం కష్టమవుతుంది.జంతువులు పిల్లలకు ఎంత తెలివిగా జీవిత పాఠాలు నేర్పుతాయో తాజాగా వైరల్‌ అవుతున్న వీడియో చెప్పకనే చెబుతోంది.ఈ వీడియోను @Yoda4ever ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.42 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటికే ఒక కోటి 14 లక్షల వ్యూస్ వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియోలో ఒక పెద్ద తల్లి కుక్క తన కుక్క పిల్లను వెంటబెట్టుకొని బయటికి వెళ్లడం మనం చూడవచ్చు.

 Mother Dog Teaches Her Puppy How To Use The Pet Door-TeluguStop.com

మొదటగా తల్లి కుక్క( Mother Dog ) మెయిన్ డోర్‌కు ఉన్న పెట్ డోర్ నుంచి బయటకు వెళ్ళింది.అయితే తల్లినే ఫాలో అవుతూ బయటికి వెళ్లాలని పిల్ల కుక్క( Puppy ) కూడా ప్రయత్నించింది.కానీ పెట్ డోర్ నుంచి ఎలా వెళ్లాలో కుక్కపిల్లకు తెలియలేదు.

అంతలోనే పెట్ డోర్( Pet Dog ) క్లోజ్ అయ్యింది.దాంతో గ్లాస్ డోర్ నుంచి బయట ఉన్న తల్లిని చూస్తూ మొరిగింది.

తనని కూడా బయటికి తీసుకు వెళ్లాలంటూ మారాం చేసింది.దాంతో తల్లి మళ్ళీ లోపలికి వచ్చి ఇలా బయటికి వెళ్లాలని చూపిస్తూ బయటకు వెళ్ళింది.

కానీ పిల్ల కుక్క తల్లిని ఫాలో కాలేకపోయింది.అది బయటికి వచ్చేలోపే పెట్‌ డోర్ మూసుకుపోయింది.

దీని ఫలితంగా ఓ పిల్ల కుక్క లోపలే ఉండి బయటికి రాలేక అల్లాడిపోయింది.

ఇక ఫలితం లేదని తల్లి కుక్క మరొక మార్గాన్ని ఆలోచించింది.అది బయటే ఉండి పెట్ డోర్ ను సగం తెరిచి, పిల్లను ఆ సందులో నుంచి బయటికి వచ్చేలా చేసింది.తర్వాత అవి రెండూ బయటికి వెళ్లి హాయిగా ఆడుకున్నాయి.

అంతటితో వీడియో ముగిసింది.ఈ వీడియో( Viral Video ) చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.

తల్లికి చాలా ఓపిక ఉందని, చాలా చక్కగా కుక్క పిల్లకు పాఠాలు నేర్పుతోందని పేర్కొంటున్నారు.దీనిని మీరూ చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube