Diksha Singhi : రూ.5 వేల పెట్టుబడితో బిజినెస్.. నేడు రూ.60 లక్షల టర్నోవర్.. ఈమె సక్సెస్ కు హ్యాట్సా ఫ్ అనాల్సిందే!

తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి బిజినెస్ లో( Business ) సక్సెస్ సాధించాలని నేటి తరం యువతలో ఎంతోమంది కలలు కంటుకున్నారు.ఆ కలను సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.

 Diksha Singhi Inspirational Success Story Details Here Goes Viral In Social Med-TeluguStop.com

కేవలం 5 వేల రూపాయల పెట్టుబడితో బిజినెస్ ను మొదలుపెట్టి ప్రస్తుతం 60 లక్షల రూపాయల రేంజ్ లో బిజినెస్ చేస్తున్న దీక్షా సింఘి( Diksha Singhi ) సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఎన్నో అవమానాలు, వేధింపులను ఎదుర్కొని దీక్షా సింఘి ఈ స్థాయికి చేరుకున్నారు.

ఎ లిటిల్ ఎక్స్ ట్రా( A Little Extra ) పేరుతో దీక్షా సింఘి స్టార్టప్ ను మొదలుపెట్టారు.బాల్యం నుంచి ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్న దీక్షా సింఘి బాడీ పాజిటివిటీ ఇన్ ఫ్లుయెన్సర్ గా పేరును సొంతం చేసుకున్నారు.

ఎ లిటిల్ ఎక్స్ ట్రా ద్వారా దీక్ష ఫ్యాషన్ ఆభరణాలను ఎక్కువగా తయారు చేస్తున్నారు.ప్రస్తుతం దీక్ష వయస్సు 29 సంవత్సరాలు కాగా ఆమె సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Telugu Extra Jewellery, Assam, Diksha Singhi, Dikshasinghi-Inspirational Storys

దీక్షా సింఘి మాట్లాడుతూ మాది అస్సాం రాష్ట్రం( Assam ) గుహావటి అని బాల్యంలో బొద్దుగా ఉండేదాన్నని చెప్పుకొచ్చారు.దుస్తులు కూడా నాకు సరిపడేవి దొరకకపోవడంతో మగవాళ్ల సెక్షన్ లో కొనుగోలు చేసేదానినని ఆమె కామెంట్లు చేశారు.స్విమ్ సూట్ విషయంలో రూల్స్ వల్ల స్విమ్మింగ్ కూడా నేర్చుకోలేదని ఆమె వెల్లడించారు.2013 సంవత్సరంలో కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం ఢిల్లీకి వచ్చానని ఆ తర్వాత బాడీ పాజిటివిటీ ఇన్ ఫ్లుయెన్సర్ గా( Body Positivity Influencer ) మారానని ఆమె పేర్కొన్నారు.

Telugu Extra Jewellery, Assam, Diksha Singhi, Dikshasinghi-Inspirational Storys

ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో లక్ష కంటే ఎక్కువగా ఫాలోవర్లు ఉన్నారని ఆమె తెలిపారు.చదువు పూర్తైన తర్వాత బిజినెస్ ను ఎంచుకుని ఎ లిటిల్ ఎక్స్ట్రా పేరుతో ఆభరణాల తయారీ మొదలుపెట్టానని దీక్ష వెల్లడించారు.సందర్భాన్ని బట్టి ధరించే విధంగా నా ఆభరణాలు ఉంటాయని ఆమె అన్నారు.5,000 పెట్టుబడితో బిజినెస్ మొదలుపెడితే ప్రస్తుతం 60 లక్షల టర్నోవర్ తో బిజినెస్ కొనసాగుతోందని దీక్ష చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube