రాజమౌలి ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగిపోతోంది.దర్శకుడు రాజమౌళి పై అభిమానులు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా లోని పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు రాజమౌళి అని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా చేసిన విషయం తెలిసిందే.
కేవలం రాజమౌళి పై మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలో నటించిన శ్రియ కూడా జక్కన్న పై పొగడ్తల వర్షం కురిపించింది అలాగే ఈ సినిమా షూటింగ్ లోని అనుభవాలను కూడా పంచుకుంది.ఈ సందర్బంగా శ్రియ మాట్లాడుతూ.ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాత్ర కోసం నన్ను పిలవగానే నేను ఓకే చెప్పేశాను.
దానికి కారణం రాజమౌళి.ఈ సినిమాలో మీది చిన్న పాత్రే అయినా చాలా ఇంపార్టెంట్ రోలో అని చెప్పగానే నేను ఓకే నేను చేస్తాను అని అన్నాను.
నేను సెట్ కు వెళ్ళినప్పుడు అది మొత్తం విలేజ్ సెటప్ లో ఉంది.సినిమాలో నా కొడుకును చంపేస్తారు.
నేను వెనక్కి తిరగ్గానే నన్ను కూడా కాల్చేస్తారు నేను చనిపోవాలి.ఆ సమయంలోనే నా కళ్ళలో బాధ, నిస్సహాయత కనిపించాలి.
ఆ సీన్ ను రాజమౌళి నాకు వివరించే టప్పుడు అప్పుడే అర్ధమైంది ఈ సీన్లో ఎంత డెప్త్ ఉంటుందో అలాగే ఆయన చెప్పినట్టే చేశాను.ఆ సీన్ సినిమాలో అద్భుతంగా పండింది అన్నారు అని చెప్పుకొచ్చింది శ్రియ.నేను రాజమౌళితో కలిసి రెండు సినిమాల్లో పనిచేశాను.2005లో ఛత్రపతి సినిమాలో నటించాను.ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో నటించాను.అప్పటికి ఇప్పటికి ఆయనలో ఏం మార్పు రాలేదు.సినిమా విషయంలో ఆయన డెడికేషన్ మాములుగా ఉండదు.ఒక సీన్ షూట్ చేయాలంటే ఆయన తన అసిస్టెంట్ డైరెక్టర్స్ తో ఆ సీన్ పై చాలా సార్లు పని చేస్తారు.
మార్నింగ్ షూట్ కు రాగానే తనకు ఏమ్ కావాలో ఎలా కావాలో చేసి చూపించి మాతో చేయించుకుంటారు.ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ పాత్రలు సినిమాలు ఎలా ఉపయోగపడతాయో,అందుకే ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యారు.
ఇప్పుడు ఆస్కార్ వరకు చేరుకున్నారు అంటూ పొగడ్తల వర్షం కురిపించింది శ్రియ.