ప్రత్యూష పోస్టుమార్టం రిపోర్ట్ లో వెల్లడైన విషయాలివే.. ఆమె తల్లి ఏమన్నారంటే?

ప్రముఖ నటి ప్రత్యూష తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.తెలుగులో 5, తమిళంలో 12 సినిమాలలో ప్రత్యూష నటించగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

 Shocking Facts Star Heroine Pratyusha Details Here Goes Viral , Pratyusha, Toll-TeluguStop.com

నల్గొండ జిల్లాలోని మధ్యతరగతి కుటుంబంలో ప్రత్యూష జన్మించగా ఆమె మరణం ఎంతోమంది బాధ పెట్టింది.ప్రత్యూష మరణం విషయంలో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి.

ప్రత్యూష తండ్రి చిన్నప్పుడే మరణించారు.ప్రత్యూష హోటల్ మేనేజ్మెంట్ చదవడంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.17 సంవత్సరాల వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రత్యూష ఎన్నో ప్రశంసలను సొంతం చేసుకున్నారు.రాయుడు, సముద్రం, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని సినిమాలు ప్రత్యూషకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ప్రత్యూష తల్లి ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

ప్రత్యూషకు కన్నడ మూవీలో ఆఫర్ వచ్చిందని ఆ సినిమాలో వెంకట్ హీరో అని ఆమె తెలిపారు.

సిద్దార్థ్ రెడ్డికి కారు ఉండేదని అతనితో మాట్లాడటానికి ప్రత్యూష వెళ్లిందని 6 గంటలకు ప్రత్యూష కాల్ చేసి డైరెక్టర్ తేజ గారి నుంచి కాల్ వచ్చిందని చెప్పిందని ప్రత్యూష తల్లి పేర్కొన్నారు.నాతో ప్రత్యూష మాట్లాడిన చివరి మాటలు అవేనని అయితే తేజ గారి ఆఫీస్ కు ప్రత్యూష వెళ్లలేదని ఆమె తల్లి అన్నారు.

Telugu Teja, Postmortem, Pratyusha, Rayudu, Samudram, Siddharth Reddy, Tollywood

8.30 గంటలకు ఆస్పత్రి నుంచి కాల్ వచ్చిందని ఆస్పత్రిలో నేను ప్రత్యూషను చూస్తానని చెప్పినా అనుమతి ఇవ్వలేదని ఆమె తల్లి పేర్కొన్నారు.ఆస్పత్రి నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదని ఆమె చెప్పుకొచ్చారు. 11.35 గంటలకు చనిపోయిందని చెప్పారని ప్రత్యూష తల్లి అన్నారు.తను వేసుకున్న డ్రెస్ ను మాయం చేశారని పాయిజన్ తీసుకుని చనిపోయిందని చెప్పారని ఆమె పేర్కొన్నారు.

గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టంకు తీసుకెళ్లమని సూచించారని ఆమె చెప్పుకొచ్చారు.ప్రత్యూష శరీరంపై గాట్లు ఉన్నాయని డాక్టర్ క్లిప్స్ పెట్టామని చెప్పాడని ఆమె అన్నారు.

ప్రత్యూషపై అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం రిపోస్ట్ లో వచ్చిందని ఆమె వెల్లడించారు.ఆ నివేదికను ఎవరూ పట్టించుకోలేదని ప్రత్యూష తల్లి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube