పుష్ప ది రైజ్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ ( Fahadh Faasil )ఆ సినిమాలోని పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.పుష్ప ది రైజ్ సినిమాలో ఫహద్ ఫాజిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర నిడివి పరిమితం కాగా పుష్ప ది రూల్ సినిమాలో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ లో ఫహద్ ఫాజిల్ కనిపించనున్నారు.
ఈ సినిమా కోసం ఫహద్ ఫాజిల్ భారీ స్థాయిలో పారితోషికం తీసుకున్నారు.
ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియా( Nazriya ) కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితమనే సంగతి తెలిసిందే.ఈరోజు ఫహద్ ఫాజిల్ పుట్టినరోజు కావడంతో పుష్ప2( Pushpa 2 ) సినిమా నుంచి భన్వర్ సింగ్ షెకావత్ లుక్ విడుదలైంది.ఈ లుక్ పవర్ ఫుల్ గా ఉండటంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈరోజు ఫహద్ ఫాజిల్ పుట్టినరోజు కాగా ఆయన సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.
ఒకప్పుడు నటుడిగా పనికిరాడన్న ఫహద్ ఫాజిల్ ఇప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు.తండ్రి దర్శకుడు కావడంతో ఫహద్ ఫాజిల్ సులువుగానే సినిమాల్లోకి వచ్చాడు.19 సంవత్సరాల వయస్సులోనే హీరోగా నటించగా ఫహద్ ఫాజిల్ తొలి సినిమా ఫ్లాపైంది.యాక్టింగ్ రాదనే విమర్శలతో పాటు ఫహద్ ఫాజిల్ కు అవమానాలు కూడా ఎదురయ్యాయి.ఆ విమర్శలకు భయపడి దేశం వదిలి వెళ్లిపోయిన ఫహద్ ఫాజిల్ రీఎంట్రీ ఇచ్చారు.
బక్కగా, బట్టతలతో, సాధారణ మనిషిలా కనిపించడంతో ఫహద్ పై విమర్శలు రాగా తన నటనతో ఫహద్ ఆ విమర్శలకు బదులిచ్చారు.బెంగళూరు డేస్ సక్సెస్ ఈ నటుడి కెరీర్ ను మార్చింది.
విక్రమ్, పుష్ప సినిమాలు ఫహద్ కు క్రేజ్ ను పెంచాయి.కళ్లతోనే యాక్టింగ్ చేసే ఫహద్ ఫాజిల్ ఎలాంటి పాత్ర ఇచ్చినా న్యాయం చేస్తూ తన నటనతో ఆకట్టుకుంటున్నారు.