తెలంగాణలో ఈసారి బీజేపీకి పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి అన్నారు.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మాట్లాడుతూ ఒక్క బీఆర్ఎస్ నేత కూడా బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు.
బీజేపీ ఆగడాలు కట్టడి చేసిన ఘనత తనకే దక్కిందని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.ఈ క్రమంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ ఎన్ని కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.