భయపెడుతున్న బీజేపీ.. స్పీడ్ పెంచిన షర్మిల ?

ప్రస్తుతం తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కొత్తగా పార్టీ పెట్టిన వైస్ షర్మిలకు ఏమాత్రం అనుకూలంగా లేవు.తెలంగాణాలో ప్రధాన పోటీ అంతా టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ మధ్యనే అన్నట్టుగా ఉంది తప్ప, తమ పార్టీని ఎవరు పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవడం షర్మిలకు ఆందోళన కలిగిస్తుంది.

 Sharmila Has Increased The Speed Of The Frightening Bjp Ys Sharmila, Telangana,-TeluguStop.com

టిఆర్ఎస్.కాంగ్రెస్ లోని అసంతృప్త నాయకులు పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతారని షర్మిల ఆశలు పెట్టుకోగా… అటువంటి అసంతృప్తి నాయకులంతా ఇప్పుడు బిజెపి బాట పడుతున్నారు.

ఈ మేరకు బిజెపి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది.ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో కమిటీని నియమించి ఇతర పార్టీల్లోని అసంతృప్త నాయకులను గుర్తించి, వారిని బిజెపిలో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ పరిణామాలతో తమ పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుందేమో అన్న టెన్షన్ షర్మిల లో మొదలైంది.దీంతో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు.

ఒకపక్క పాదయాత్ర కొనసాగిస్తూనే మరోపక్క కేసీఆర్ ప్రభుత్వం అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి తమ పార్టీ ఇమేజ్ పెంచుకోవాలని షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు .దీనిలో భాగంగానే టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మితమైన భారీ నీటి ప్రాజెక్టుల్లో అవినీతి చోటు చేసుకుంది అంటూ కొద్ది రోజులుగా షర్మిల ఆరోపణలు చేస్తున్నారు.అంతటితో సరిపెట్టకుండా.ఇదే విషయంపై జల వనరుల మంత్రిత్వ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ను కలిశారు.ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి చోటు చేస్తుందని ఆరోపిస్తూ, ఈ ఎన్ సి కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు.

Telugu Congress, Telangana, Trs, Ys Sharmila-Politics

తెలంగాణలోని భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకులు జరిగాయని షర్మిల ఆరోపణలు చేస్తున్నారు.ఈ మేరకు గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ తో ఇదే విషయమై చర్చించేందుకు షర్మిల సమావేశం కాబోతున్నారు.ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను షర్మిల కలవబోతున్నారు.

ఈ మేరకు అపాయింట్మెంట్ కూడా ఖరారు అయినట్లు సమాచారం.ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై గవర్నర్ అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో షర్మిల కూడా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయబోతున్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం పై వైయస్సార్ తెలంగాణ పార్టీ రాజీలేకుండా పోరాడుతోందని నిరూపించుకునేందుకు, బిజెపిలోకి వెళ్తున్నవలసలను తమ పార్టీ వైపు తిప్పుకునే విధంగానూ షర్మిల వ్యవహాత్మకంగా దూకుడు పెంచుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube