మద్యం వ్యాపారాన్ని ప్రారంభించనున్న ప్రముఖ హీరో తనయుడు

బాలీవుడ్ కింగ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తరచూ వార్తల్లో కనిపిస్తున్నాడు.ఆర్యన్ త్వరలోనే సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నాడని కొన్ని రోజుల క్రితం నుంచి వార్తలు వచ్చాయి.

 Shah Rukh Khans Son Aryan Vodka Business , Shah Rukh Khan ,aryan,vodka Business,-TeluguStop.com

అయితే ఇంతలో ఆర్యన్ తాను నిర్వహిస్తున్న మద్యం వ్యాపారం కారణంగా చర్చల్లో నిలిచాడు.ఆర్యన్ ఖాన్ మరో ఇద్దరు వ్యాపార భాగస్వాములతో కలిసి స్లాబ్ వెంచర్ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు.

ఇంతేకాదు ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద బీర్ తయారీ సంస్థ అయిన ఏబీ ఇన్బేవ్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.ప్రధానంగా చెప్పుకోవలసినది… ఈ కంపెనీ తన ప్రీమియం నాణ్యత గల వోడ్కాను భారతదేశంలో విడుదల చేస్తుంది.

ఏబీ ఇన్బేవ్‌ భారతదేశంలో ప్రసిద్ధ బడ్‌వైజర్, కరోనా బీర్‌లను విక్రయిస్తున్న సంస్థ.ఈ వ్యాపారం సంస్థ ముగ్గురు భాగస్వాములతో ఏర్పాటయ్యిది.

ఆర్యన్ తన వ్యాపారాన్ని భాగస్వాములైన బంటీ సింగ్, లెటి బ్లాగోవాతో కలిసి ప్రారంభిస్తున్నాడు.ఈ ముగ్గురు భాగస్వాములు కలిసి అల్ట్రా-ప్రీమియం వోడ్కా బ్రాండ్ డి’యావోల్‌ను విడుదల చేయనున్నారు.

ఇది భారతదేశంలో ఏబీ ఇన్బేవ్‌ ద్వారా విక్రయాల జరపనుంది.యూత్ మైండ్ సెట్ తనకు అర్థమైందని ఆర్యన్ చెప్పారు.

ప్రస్తుతం భారతదేశంలో ఇటువంటి బ్రాండ్‌ల కొరత ఉంది.అందుకే వీటిని విక్రయించడానికి చాలా అవకాశం ఉంది.

వచ్చే ఏడాది నాటికి కంపెనీ రమ్, విస్కీలను కూడా తయారు చేయనుంది.ఆర్యన్ ఖాన్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రముఖ పానీయాల కంపెనీ ద్వారా విస్కీ, రమ్ వంటి బ్రౌన్ స్పిరిట్‌లను కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

ముందుగా ప్రీమియం వోడ్కా బ్రాండ్ అందుబాటులోకి రానుంది.ఆ తర్వాత బ్రౌన్ స్పిరిట్ మార్కెట్లోకి రానుంది.

కంపెనీ ప్రీమియం ఉత్పత్తులను కూడా ప్రారంభించనుంది.

Telugu Ab Inbev, Aryan, Aryan Khan, Brown Spirit, Bunty Singh, Leti Blagoa, Liqu

ఆర్యన్ ఖాన్ తన వ్యాపార భాగస్వాములతో కలిసి భారతదేశంలో అనేక ప్రీమియం బ్రాండ్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నాడు.ఇందులో దుస్తులు, ఉపకరణాలు కూడా చేరివున్నాయి.వచ్చే ఏడాది స్లాబ్ తన వోడ్కా బ్రాండ్‌ను ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా మార్కెట్‌లకు తీసుకెళ్లాలని కూడా యోచిస్తోంది.

ఆర్యన్ ఖాన్, అతని వ్యాపార భాగస్వాములు స్నేహితులు.ముగ్గురూ 2018లో జర్మనీలో కలుసుకున్నారు.ఆ సమయంలో వారు భారతదేశంలో లగ్జరీ ఉత్పత్తులు, సేవలను ప్రారంభించడం గురించి చర్చించారు.కాగా ఆర్యన్ సౌత్ కాలిఫోర్నియా యూనివర్శిటీ నుండి పట్టభద్రుడయ్యాడు.

త్వరలో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు.ఆర్యన్ హీరోగా అడుగుపెట్టనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే ఇటీవలి వార్తల ప్రకారం, ఆర్యన్ ఖాన్ స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్‌గా పనిచేయనున్నారు.అతని మొదటి స్క్రిప్ట్ పూర్తయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube