అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా సరే అధికారం దక్కించుకోవాలని అనుకుంటున్న డెమోక్రటిక్ పార్టీ తన వ్యుహాలని సిద్దం చేస్తోంది.ఇప్పటికే ఎంతో వ్యూహాత్మక అడుగులు వేస్తూ ప్రజలని తమవైపుకి తిప్పుకుంటున్న ఈ పార్టీ ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ కి భారత సంతతికి చెందిన కమలా హారిస్ ని నిలబెట్టాలని చూస్తున్నట్టుగా అంచనా ఉంది…ఇదిలాఉంటే .
మరో వైపు మరో భారత సంతతికి చెందిన ఇండో అమెరికన్ మహిళని డెమోక్రటిక్ పార్టీ తమలోకి తీసుకుంది ఆమె పేరు సీమా నంద ఆమెని అమెరికాలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ వ్యవహారాల నిర్వహణలో కీలక భాద్యతలు అప్పగించారు ఇంతకీ ఇక్కడ మరో గొప్ప విషయం ఏమిటంటే.ఒక భారత సంతతి మహిళ డెమాక్రటిక్ పార్టీకి ఇలాంటి కీలక భాద్యతలు అందించడం ఇదే ప్రధమం.
అయితే సీమా నందా వచ్చే నెలలో ఈ కీలక భాద్యతలని చేపట్టనున్నారని తెలిపారు.ఆమె డీఎన్‌సీ రోజువారీ కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తారు.ప్రస్తుత డీఎన్‌సీ చైర్మన్ టామ్ పెరెజ్ అమెరికా కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సీమా∙పనిచేశారు…జీవితకాలంలో ఒక్కసారే ఇలాంటి పదవి దక్కుతుందని ఈ పదవి కి నన్ను ఎంపిక చేయడం కాలా సంతోషంగా ఉందని నా మీద పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు సీమా నందా