ఏ ఉద్దేశ్యం తో ఆమెను గృహనిర్బంధంలో ఉంచారు... ప్రశ్నించిన సుప్రీంకోర్టు

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి గృహ నిర్బంధం పై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది.జమ్ము కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే.

 Supreme Court Asked How Long Does The Government Can Be Detained Mehbooba, Mehbo-TeluguStop.com

దీనితో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం తో అక్కడ ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకూడదు అన్న ఉద్దేశ్యంతో ముందస్తు చర్యల్లో భాగంగా మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు రాజకీయ పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచింది.అయితే సుమారు ఏడాది పాటు ఫరూక్ ను గృహ నిర్బంధంలో ఉంచి రెండు నెలల కిందటే విడుదల చేయగా, ఆయనకంటే ముందు ఒమర్ అబ్దుల్లా కూడా విడుదల అయ్యారు.

అయితే ముప్తి ని మాత్రం మరో ఆరు నెలల పాటు గృహనిర్బంధంలోనే ఉంచాలి అంటూ నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో తన తల్లిని ఏడాదికిపైగా గృహ నిర్బంధంలో ఉంచడంపై ఆమె కుమార్తె ఇల్టిజా ముఫ్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఏడాదికి పైగా తన తల్లిని నిర్బంధించడం అక్రమమని, దీనిపై తాను గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు జమ్ము కాశ్మీర్ అధికారులు ఇంతవరకు కోర్టుకు సమాధానం ఇవ్వలేదు అన్న విషయాన్నీ ఆమె గుర్తు చేసారు.కోర్టు పట్ల అధికారులకు ఉన్న గౌరవం ఏంటో ఈ అంశం తో అర్ధం అవుతుంది అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అంతేకాకుండా తన తల్లిని కలిసేందుకు కుటుంబ సభ్యులను అధికారులు అనుమతించడంలేదని, ముఫ్తీని కోర్టులో ప్రవేశపెట్టేందుకు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి కోర్టు అనుమతి కావాలి అంటూ ఆమె పిటీషన్ లో కోరారు.ఈ నేపథ్యంలో ఆ పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మెహబూబా ముఫ్తీని ఇంకా ఎంత కాలం గృహ నిర్బంధంలో ఉంచుతారని ప్రశ్నించింది.

ఏ ఉద్దేశంతో ఆమెను నిర్బంధంలో ఉంచుతున్నారని జమ్ము కాశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని నిలదీసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube