పాదాల వాపు కి కారణం ఏంటి.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసా?

పాదాల వాపు.( Swollen Feet ) చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు.

 Effective Home Remedies For Swollen Feet Details! Swollen Feet, Home Remedies, S-TeluguStop.com

గంటల తరబడి కూర్చోవడం, ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం, పోషకాల కొరత, శరీరానికి సరిపడా నీరు అందకపోవడం తదితర కారణాల వల్ల పాదాలు వాపు వస్తుంటాయి, దీని కారణంగా నొప్పితో పాటు కాస్త అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది.ఈ క్రమంలోనే పాదాల వాపు సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి తెలియక మదన పడుతుంటారు.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ అద్భుతంగా సహాయపడతాయి.ఈ చిట్కాలను పాటిస్తే సులభంగా పాదాల వాపు సమస్యను నివారించుకోవచ్చు.

ముందుగా ఒక బకెట్ లో సగానికి గోరు వెచ్చని వాటర్ ను( Warm Water ) తీసుకోవాలి.ఈ వాట‌ర్ లో రెండు టేబుల్ స్పూన్లు ఎప్సోమ్ సాల్ట్( Epsom Salt ) వేసి కలిపి అందులో పాదాలలో ప‌దిహేను నిమిషాల పాటు ఉంచాలి.

ఇలా సాల్ట్ వాటర్ లో పాదాలను ఉంచితే వాపు తగ్గుతుంది.

Telugu Epsom Salt, Tips, Latest, Swollen Feet, Warm-Telugu Health

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు బియ్యం ఉడికించిన తర్వాత వచ్చే గంజి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచాలి.

ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.పాదాల వాపు సమస్యను నివారించడానికి ఈ రెమెడీ కూడా ఉత్తమంగా సహాయపడుతుంది.

Telugu Epsom Salt, Tips, Latest, Swollen Feet, Warm-Telugu Health

పాదాల వాపును తగ్గించడానికి పలు ఎసెన్షియల్ ఆయిల్స్ గ్రేట్ గా హెల్ప్‌ చేస్తాయి.ఒక బకెట్ లో సగానికి గోరువెచ్చని వాటర్ ను తీసుకుని అందులో నాలుగు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్, నాలుగు చుక్కలు పిప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్, నాలుగు చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి.ఈ వాటర్ లో పాదాలను ప‌ది నిమిషాల పాటు నానబెట్టాలి.ఇలా చేసిన మంచి రిజల్ట్ ఉంటుంది.

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పాలు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని పాదాలపై అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి.

ఆపై వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే పాదాల వాపు దెబ్బకు పరార్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube