టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ కపుల్స్ ఎవరైనా ఉన్నారు అంటే అందులో మొదటి వరుసలో నిలబడే జంట అల్లు అర్జున్, స్నేహ రెడ్డి. బయట ఫంక్షన్స్ ఏదైనా జరిగినప్పుడు కూడా ఇద్దరు జంటగా ప్రత్యక్షమవుతారు.2011 సంవత్సరం మార్చి 6న ఈ జంట అశేష అతిథుల మధ్య ఒక్కటయ్యారు.ప్రస్తుతం వీరిద్దరికీ ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ సినిమాల పరంగా ఎన్ని సమస్యలు ఉన్నా చివరికి మాత్రం తన ఫ్యామిలీతో గడపడానికి కొంత సమయాన్ని ఖచ్చితంగా కేటాయిస్తాడు.
ఇకపోతే నేడు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి బర్త్ డే కావడంతో గత రాత్రి ఆమె పుట్టిన రోజు వేడుకలు వారి ఇంట్లోనే జరిపించాడు.
ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో కేవలం తన ఇంటి కుటుంబ సభ్యుల నేపథ్యంలోనే కేక్ కట్ చేయించి వేడుకలు జరిపారు.అయితే ఈ కార్యక్రమంలో కేవలం బన్నీ ఇంటి సభ్యులు మాత్రమే పాలుపంచుకున్నారు.
ఈ కార్యక్రమం సంబంధించి తాజాగా అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేసి తన భార్యకు విషస్ తెలియజేశారు.
బన్నీ తన భార్యకు విషెస్ తెలుపుతూ.
నా భార్య ఇలాంటి అందమైన రోజులు మళ్లీ మళ్లీ జరుపుకోవాలని… తనతో కలిసి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూన్నట్లు అల్లుఅర్జున్ ట్విట్టర్ పూర్వకంగా తెలియజేశాడు.అల్లు అర్జున్, స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటారు.
అల్లు అర్జున్ తన సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ వివరాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు షేర్ చేస్తూనే ఉంటాడు.అలాగే స్నేహ రెడ్డి కూడా తన పిల్లలకు సంబంధించి వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బన్ని అభిమానులను ఉత్సాహపరుస్తుంది.