ఇద్దరు అమ్మాయిలకు టోకరా.. సరిగ్గా తాళి కట్టే టైములో దొరికిపోయాడు

అతడు ఎస్‌బీఐ బ్యాంక్‌ మేనేజర్‌.నెలకు ఎంత లేదన్నా లక్షకుపైనే జీతం ఉంటుంది.

అది చాలదన్నట్లు ఆ హోదానే అడ్డం పెట్టుకొని తన పెళ్లితో సంపాదించాలని అనుకున్నాడు.అడ్డంగా బుక్కయ్యాడు.

తిరుపతి ఎస్‌బీఐ మేనేజర్‌గా పని చేస్తున్న మోహన్‌కృష్ణ ఇద్దరు అమ్మాయిలను మోసం చేద్దామనుకొని తానే దొరికిపోయాడు.

ఈ మోహన్‌కృష్ణ మొదట మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు.దీనికోసం 16 లక్షల నగదు, 6 తులాల బంగారం కూడా తీసుకున్నాడు.తీరా ఎంగేజ్‌మెంట్‌ తర్వాత జాతకాల కలవడం లేదని పెళ్లి రద్దు చేసుకున్నాడు.

Advertisement

తీసుకున్న డబ్బు, బంగారం తిరిగి ఇవ్వమని అడిగితే కుదరదన్నాడు.ఆ తర్వాత కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు.

ఆమె దగ్గర కూడా పది లక్షల నగదు, 12 తులాల బంగారం కట్నం రూపంలో తీసుకున్నాడు.ఆదివారం నంద్యాలలో పెళ్లికి సిద్ధమయ్యాడు.

అయితే తీరా పెళ్లి రోజు మొదటి యువతి బంధువులు అక్కడికి చేరుకున్నారు.

అతన్ని చితకబాదారు.విషయం తెలుసుకొని రెండో యువతి బంధువులు కూడా నాలుగు తగిలించారు.ముందే ఫిర్యాదు అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకొని మోహన్‌కృష్ణను కల్యాణ మండపం నుంచి అలాగే పెళ్లి డ్రెస్‌తో పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇప్పుడా ఇద్దరు యువతుల తల్లిదండ్రులు తమ దగ్గర తీసుకున్న డబ్బు, బంగారం ఇవ్వాలని మోహన్‌కృష్ణను అడుగుతున్నారు.పేరుకు బ్యాంక్‌లో మంచి ఉద్యోగమే అయినా.మొదటి నుంచీ మోసాల జీవితమే అతనిది.

Advertisement

పదేళ్ల కిందట కెనరా బ్యాంక్‌లో పని చేస్తున్నపుడే జనం దగ్గర డబ్బు వసూలు చేసి పారిపోయాడు.అప్పుడే అతనిపై కేసు నమోదైంది.

ఇప్పుడు పెళ్లి పేరుతో ఇద్దరు యువతులను మోసం చేయడానికి ప్రయత్నించి బుక్కయ్యాడు.

తాజా వార్తలు