తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో టాప్ 3 హీరోయిన్స్ బ్రేక్ లో ఉన్నారు.అయితే ఆ నలుగురు స్టార్ హీరోయిన్ లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజన్ కూడా ఉంది.
కానీ నలుగురు హీరోయిన్ లు ఒకేసారి బ్రేక్ తీసుకోవడంపై ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో చర్చలు కొనసాగుతున్నాయి.మరి బ్రేక్ లో ఉన్న ఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిని కొనసాగుతూ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సమంత ఇటీవలే తన హెల్త్ విషయం గురించి బయట పెట్టి అభిమానులకు ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది సమంత.కాగా సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధి కి చికిత్స తీసుకుంటూనే యశోద పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
సామ్ పూర్తిగా కోలుకున్న తరువాతే నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.మరొక స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.
పూజా కూడా ప్రస్తుతం రెస్ట్‌లోనే ఉంది.కాలు ఫ్యాక్చర్ కావటంతో చాలా రోజులుగా ఇంటికే పరిమితం అయ్యింది.
కాగా ఇటీవల ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నప్పటికీ పూర్తి స్థాయిలో షూటింగ్ చేసేందుకు వీలు కాకపోవటంతో మూవీ షెడ్యూల్స్‌ను వాయిదా వేసుకుంది పూజా హెగ్డే.అలాగే టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న కూడా ప్రస్తుతం బ్రేక్ లో ఉంది.
సోషల్ మీడియాలో తన మీద వస్తున్న నెగెటివిటీ తో విసిగిపోయిన రష్మిక ఈ డిస్ట్రబెన్స్ నుంచి షార్ట్ బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యిందట.

పుష్ప 2 షెడ్యూల్ కు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌ను పర్సనల్ యాక్టివిటీస్ కోసం కేటాయించారు రష్మిక.అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా పని సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత ప్రెగ్నెంట్ కావడంతో ఆమె సినిమాలకు దూరం అయింది.
అయితే ఈ మధ్యకాలంలో మళ్లీ ఆమె సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.ఇలా ఒకేసారి నలుగురు స్టార్ హీరోయిన్లు బ్రేక్ తీసుకోవటంతో ఈ ఎఫెక్ట్ అప్‌కమింగ్ సినిమాల రిలీజ్ డేట్స్ మీద పడే ఛాన్స్ ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.