సినిమా ఇండస్ట్రీ లో ఉండే చాలా మంది నటులు డైరెక్టర్లు వాళ్ళకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంటారు అయితే కొంతమంది డైరెక్టర్లు మాత్రం వాళ్లకు వచ్చిన సక్సెస్ లను కొలమానంగా చేసుకొని ఆ తర్వాత దానికంటే మంచి సక్సెస్ ని కొట్టాలని చూస్తూ ఉంటారు.ఇక ఇప్పుడు కూడా కొంత మంది డైరెక్టర్లు అదే ఫాలో అవుతూ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈయన ముందుగా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత అడివి శేషు ని హీరో గా పెట్టీ హిట్ 2 అనే సినిమా చేశాడు.
ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది.
ఇక దాంతో వెంకటేష్( Venkatesh ) ని హీరో గా పెట్టీ సైందవ్( Saindhav ) అనే సినిమా చేసాడు.ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ నిన్న రిలీజ్ అయిన గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు మంచి టాక్ ను సంపాదించుకోవడం తో వెంకటేష్ సైంధవ్ సినిమా మీద కలక్షన్ల పరంగా కొంతవరకైతే వేటు పడే అవకాశాలు అయితే ఉన్నాయి.ఎందుకంటే ఆ రెండు సినిమాలకి ఆల్రెడీ సక్సెస్ టాక్ తెచ్చుకొని మంచి ఊపులో దూసుకుపోతున్నాయి.
కాబట్టి వెంకటేష్ సినిమా మీద ఎలాగైనా కొంతవరకు భారం అయితే పడే అవకాశాలైతే ఉన్నాయి అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ ఈ సినిమాతో తన నట విశ్వరూపం చూపించాడు అంటూ ఈ సినిమా చూసిన అభిమానులందరూ వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక ఈ సినిమాని చూడటానికి ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నట్టు గా తెలుస్తుంది…
.