తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.ఈ క్రమంలో కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది.
కామారెడ్డిలో బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ బరిలో నిలవగా కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.దీంతో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటివరకు మూడు రౌండ్ల లెక్కింపు పూర్తి కాగా మొత్తంగా రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు.తరువాతి స్థానంలో కేసీఆర్ నిలవగా మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉన్నారు.
అయితే కామారెడ్డి నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోట ఉన్న సంగతి తెలిసిందే.మరోవైపు ఎల్లారెడ్డిలోనూ కాంగ్రెస్ పార్టీనే ముందంజలో ఉంది.