రోజా ని ఎలా కాపాడచ్చు అంటే .

సాధారణ గొడవ కి వైకాపా ఎమ్మేల్యే రోజా ని ఏడాది పాటు సస్పెండ్ చెయ్యడం వైకాపా తీవ్రంగా పరిగనిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ విషయం మీద స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఒక ప్రత్యెక కమిటీ వేసి ఈ విషయం తేల్చడానికి సిద్దమైన విషయం తెలిసిందే.

 Request Of Reducing The Suspension Period Of Roja-TeluguStop.com

ఈ కమిటీ ఈ నెల ఆఖరుకల్లా రిపోర్ట్ ఇస్తుంది.గడిచిన అసంబ్లీ శీతాకాల సమావేశాలని పరిశీలించి మరీ ఈ కమిటీ నిర్ణయం తెలియజేస్తుంది.

ఏడాదిన్నర కాలంలో జరిగిన ఇతర అసంబ్లీ సమావేశాలూ అందులో అధికార – ప్రతిపక్ష పార్టీల తీరుని సమన్యవం చేసి, పరిశీలించి మరీ రిపోర్టు ఇస్తారు.వైకాపా తరఫున ఆ కమిటీ లో సీనియర్ నేత శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.

కమిటీ కి అధ్యక్షుడు గా ఉన్న డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ టీడీపీ వ్యక్తి.అన్ని పార్టీల నుంచీ ఒకరోకర్ని పెట్టారు కాబట్టి వాదన ఏకపక్షంగా సాగుతుంది అని చెప్పేయచ్చు.

సో ఈ కమిటీ ని ఉపయోగించుకుని అసంబ్లీ సమావేశాల్లో టీడీపీ తీరుని ఎండగట్టడానికి వై కా పా ఈ కమిటీ ని ఉపయోగించుకోబోతోంది.మరొక పక్క తనతోపాటు మొత్తంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేంతా సీఎంని విమర్శించారనీ, తనను మాత్రమే ఏడాదిపాటు సస్పెండ్‌ చేయడం వెనుక అధికార పార్టీ కుట్ర వుందన్నది రోజా ఆరోపణ.

స్పీకర్‌ నియమించిన కమిటీ రిపోర్ట్‌ వచ్చాక, తన సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేయాలని రోజా చూస్తున్నారు.రోజా చెప్పింది కూడా అర్ధ రహితంగా లేదు.

అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ‘ఏంట్రా రేయ్‌.పాతేస్తా.నా కొడక.’ అంటూ అసభ్య పదజాలం ఉపయోగించారు.కొడాలి నాని కూడా పాతేస్తా , చంపేస్తా అంటూ మాట్లాడారు ప్రతిపక్షం మీద అధికార పక్షం, అధికార పక్షం మీద ప్రతి పక్షం తిట్ల దండకం తో సభలు మూసేశారు గానీ జనాల గోల పట్టించుకోలేదు.సో ఈ కమిటీ ని వాడుకుని అయితే వారికీ శిక్ష వెయ్యండి లేదా రోజా సస్పెన్షన్ సమయం తగ్గించండి అని డిమాండ్ చెయ్యాలని వైకాపా చూస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube