ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ , బిజెపి ( Congress,BJP ) లలో సీఎం ఎవరు అనే దానిపై చాలామంది నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.బీఆర్ఎస్ లో సీఎం అభ్యర్థి పై అందరికీ క్లారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్,బిజెపిలో మాత్రం ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేదానిపై ప్రజలకు, నాయకులకు కూడా క్లారిటీ లేదు.
ఇక కాంగ్రెస్లో అయితే ఇది మరీ ఎక్కువ.ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్క నేత మేమే సీఎం అని చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే సీఎం పదవి పై జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,సీతక్క, రేవంత్ రెడ్డి( Revanth reddy ) , ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి ఇలా పలువురు సీనియర్ నాయకులు ఆశ పెట్టుకున్నారు.
ఇక వీరిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం సీటు ఎవరిని వరిస్తుందో అని అందరిలో ఉత్కంఠ ఉంది.ఈ అందరిలో ఎవరికీ సీఎం అవకాశం ఇచ్చిన మిగతావారు తీవ్ర అసంతృప్తితో ఉండడం ఖాయం.అయితే తాజాగా కాంగ్రెస్ నాయకురాలు రేణుక చౌదరి సీఎం అభ్యర్థి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రేణుక చౌదరి (Renuka chowdary) మాట్లాడుతూ.తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.
ఖమ్మంలో ఉన్న పది కి పది సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది.
అయితే సీఎం సీటు ఎవరిది అనేదానిపై అందరికీ ఉత్కంఠ గా ఉంది.కానీ గెలిచిన ప్రతి ఒక్కరికి సీఎం సీటు అడిగే అర్హత ఉంది.కానీ పార్టీ అధిష్టానం ఎవరైతే రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడుపుతారు అని భావిస్తుందో వారికే సీఎం పదవిని కట్టబెడతారు.
ఎంత పెద్ద నాయకులైనా సరే అధిష్టానాన్ని మెప్పించిన వారినే సీఎం సీటు వరిస్తుంది.ఇక ఇప్పటికే మనం కర్ణాటకలో సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రజలు అలాగే అధిష్టానం నిర్ణయం మేరకు సిద్ధ రామయ్య ( Sidda Ramayya) ను సీఎం చేయడం చూశాం.
కానీ అక్కడ అందరూ డీకే శివకుమార్ ( DK Shiva kumar ) సీఎం అవుతారని భావించారు.ఇక అందరూ అనుకున్న దానికి వ్యతిరేకంగా అక్కడ అధిష్టానం ప్రజలు సిద్ధ రామయ్యను సీఎం అభ్యర్థిగా నిలబెట్టారు.
ఇక తెలంగాణలో కూడా అంతే.కర్ణాటక మాదిరిగానే ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేదానిపై స్పష్టత వస్తుంది అంటూ రేణుక చౌదరి చెప్పుకొచ్చింది.