రవి కృష్ణ( Ravi krishna ) అంటే ఎవరో నిన్న మొన్నటి వరకు టీవీ ప్రేక్షకులకు తప్ప ఎవరికి తెలియదు. మొగిలి రేకులు సీరియల్ నుంచి కెరీర్ మొదలు పెట్టిన రవి కృష్ణ బిగ్ బాస్ లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
కానీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.అయినా కూడా పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు.
హీరో అవ్వాలని ఎలాంటి కలలు లేవు కానీ మంచి నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై వెలగాలని మాత్రం తాపత్రయం అయితే ఉంది.బాగా నటించగల సత్తా కూడా ఉంది.
అదే దైర్యం తో ఇటీవల సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి కేవలం రియాలిటీ షో లలో మాత్రమే కనిపిస్తూ నటుడిగా పలు సినిమాలకు ఆడిషన్ కూడా ఇస్తున్నాడు.
అయితే మొదట విరూపాక్ష( Virupaksha ) లో రవి కృష్ణ పాత్రా కోసం చాల మందిని ఆడిషన్ చేయగా ఎవరు ఆ రోల్ కి సెట్ కాలేదట.ఇటీవల కంచెరపాలెం సినిమా( Care of Kancharapalem ) తో సూపర్ హిట్ ఆక్టర్ గా పలు సినిమాల్లో కనిపిస్తున్న కార్తీక్ రత్నం ఆడిషన్ అయ్యాక అతడినే కంఫర్మ్ చేసిన ఎందుకో గాని ఆ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడట.దాంతో రవి కృష్ణ ను ఆడిషన్ కి వచ్చి ఈ పాత్ర లో సెట్ అయ్యాడు.
ఇక సినిమా విజయం సాధించడం తో రవి కృష్ణ చాల బిజీ స్టార్ గా మారబోతున్నాడు. విరూపాక్ష విజయం తర్వాత కొంత మంది నిర్మాతలు రవి కృష్ణ ను బుక్ చేస్తున్నారట.ఇదే క్రమం లో ఇప్పటికే మూడు సినిమాల్లో కూడా హీరో కి ఫ్రెండ్ గా, ముఖ్యమైన పాత్రలో నటించడానికి సైన్ చేసాడట.ఇక ముందు ముందు మరిన్ని మంచి పాత్రలు దక్కాలని రవి కృష్ణ ఆశిస్తున్నాడు.
ఇక రవి కృష్ణ కెరీర్ మొత్తం సీరియల్ ఇండస్ట్రీ కాబట్టి అతడితో పాటే నటించే నవ్య స్వామి అనే మరో బుల్లి తెర నటితో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఇండస్ట్రీ లో ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.ఇద్దరు ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్న గుసగుసలు మాత్రం బ్రేక్ పడటం లేదు.ఇక పవన్ కళ్యాణ్ పక్కన నటించాలనే కోరిక ఉందని చెప్తున్నాడు రవి కృష్ణ.ఏది ఏమైనా ఇలా ఒక సీరియల్ స్టార్ సినిమా స్టార్ కావడం మాత్రం మంచి విషయమే కదా…!