అగ్ర రాజ్యం అమెరికా పేరు చెప్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎలాంటి దేశం అయినా సరే సైలెంట్ అవ్వాల్సిందే.అమెరికాతో తలపడి మనం సాధించేది ఏముంటుంది యుద్ధం తప్ప అనేకునే వాళ్ళు లేకపోరు.
అందుకే అన్ని దేశాలు స్నేహ భావంతోనే ఉంటాయి.అలాంటి అగ్ర రాజ్యం అమెరికాలోని వైట్ హౌస్ ని గడగడలాడిస్తున్నాయి అక్కడి ఎలుకలు.
వైట్ హౌస్ సెక్యూరిటీ వాళ్లకి అతి పెద్ద సవాల్ గా మారుతున్నాయి.
కావాలని అనుకునే ఏదన్నా సాధ్యం చేసుకోగల ట్రంప్ కి ఈ ఎలుకల బెడద మాత్రం పోవడం లేదు.
ట్రంప్ ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి.ఎటు నుంచీ ఎప్పుడు ఎలా వస్తాయో తెలియక వైట్ హౌస్ సిబ్బంది సరిగా నిద్ర కూడా పోనీ పరిస్థితి నెలకొందట.
చివరికి బొద్దింకలు, చీమలుని కూడా తరిమి కొట్టలేపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో అధ్యక్షుడి పరువు పోయేలా పోస్టులు హల్చల్ చేస్తున్నాయి.

మొన్నటికి మొన్న వైట్ హౌస్ లో విలేఖరులతో సమావేశం జరుగుతోంది.ఉన్నట్టుండి ఒక్క సారిగా సీలింగ్ పై భాగం నుంచీ వైట్ హౌస్ కరస్పాండెంట్ పై ఓ భారీ సైజు ఎలుక మీద పడిందట.దాంతో షాక్ అయ్యిన ఆయన ఒక్క సారిగా లేచి ఎలుకని పట్టుకునే పనిలో పడ్డాడు.
పక్కనే ఉన్న విలేఖరులు సైతం ఎలుకని పట్టుకునే ప్రయత్నాలు చేశారు.ఈ తతంగం అంతా మరో కొందరు విలేఖరులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ట్రంప్ పరువు మొత్తం పోయింది.
వైట్ హౌస్ లో ఎలుకలు పోగొట్టండి ఆ తరువాత ఏదన్నా చేయచ్చు అంటూ సెటైర్స్ వేస్తున్నారు.