ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో బీజేపీ( BJP ) ఏపీ ఎన్నికల విషయంలో కీలకంగా రాణిస్తోంది.
ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్( Raj Nath Singh ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏపీకి రాజధాని అనే విషయంపై రాజ్ నాథ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన సమాచారం ఇచ్చిందని గుర్తు చేశారు.
వచ్చే ఐదు ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని వ్యాఖ్యానించారు.తనకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఈ విషయం చెబుతున్నట్లు పేర్కొన్నారు.రాష్ట్రంలో గతంలో కంటే ఈసారి బీజేపీ ఓటు బ్యాంకు పెరిగింది అని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇబ్బందులు ఉన్నా పోరాటాల ద్వారాన్ని ప్రజల్లో నిలుస్తామని స్పష్టం చేశారు.
ఇదే సమావేశంలో ఏపీలో పొత్తులు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు.దేశంలో మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి రానుంది అని తెలియజేశారు.
మూడోసారి మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా నరేంద్ర మోదీనే( Narendra Modi ) ప్రధాని అని అన్నారు.భారతదేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు.
ఈ మీటింగ్ లో రాజ్నాథ్ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.