రజనీకాంత్ ఖాతాలో అరుదైన ఘనతలు.. క్రేజీ రికార్డులు ఆయన సొంతమయ్యాయా?

సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) గురించి మనందరికీ తెలిసిందే.రజనీకాంత్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

 Rajinikanth Vettaiyan Seventh Film To Enter 200cr Club Details, Rajinikanth, Vet-TeluguStop.com

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు రజనీకాంత్.కాగా రజనీకాంత్ సినిమా విడుదల అవుతుంది అంటే థియేటర్ ల వద్ద పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది.

ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం వెట్టేయాన్.( Vettaiyan ) ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

అంతేకాకుండా విడుదలైన నాలుగు రోజుల్లోనే 240 కోట్ల గ్రాస్ తెచ్చింది.

Telugu Rajinikanth, Tollywood, Vettaiyan-Movie

దీంతో ర‌జ‌నీకాంత్ కెరీర్ లో 200 కోట్ల క్ల‌బ్ లో చేరిన ఏడ‌వ చిత్రంగా వెట్టేయాన్ సినిమా నిలిచింది.అయితే ఈ సినిమా కంటే ముందు రజనీకాంత్ నటించిన పేట, దర్బార్, ఎంథిరన్, కబాలి,జైలర్, రోబో 2.0 లాంటి సినిమాలు విడుదల అయ్యి 200 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.కేవలం వ్యాప్తంగానే కాకుండా చైనా, మ‌లేషియా, జ‌పాన్, కొరియా దేశాల్లో , థాయ్ లాండ్ దేశాల్లో సూప‌ర్ స్టార్ ఇమేజ్ పీక్స్ లో ఉంది.ఆయ‌న స్టైల్ కి ఇండియ‌న్స్ మాత్ర‌మే కాదు.

దేశ విదేశాల్లోనూ అభిమానులు ఉన్నార‌ని ఎన్నో సినిమాలు రుజువు చేసాయి.

Telugu Rajinikanth, Tollywood, Vettaiyan-Movie

అందులో తొలుత బీజం వేసింది ముత్తు చిత్రం.అందులో త‌లైవార్ స్టైల్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు.అప్పటి నుంచి ర‌జ‌నీ సినిమాలు విదేశాల్లో క్ర‌మం త‌ప్ప‌కుండా రిలీజ్ అవుతుంటాయి.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శక‌త్వంలో కూలీ చిత్రంలో( Coolie Movie ) న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.గ్యాంగ్ స్ట‌ర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.

ఇందులో తైల‌వా గోల్డ్ స్మ‌గ్ల‌ర్ పాత్ర పోషిస్తున్నారు.ఈ పాత్ర గ‌నుక క‌నెక్ట్ అయిందంటే? మళ్లీ వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్ల వ‌ర‌దే అని చెప్పాలి.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube