తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. పోటీలో ఉంది వీరేనా ? 

ఎప్పటి నుంచో తెలంగాణ క్యాబినెట్ ను( Telangana Cabinet ) విస్తరిస్తారు అనే ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కూడా అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు.

 These Congress Leaders Are Likely To Get Minister Seats In Telangana Cabinet Exp-TeluguStop.com

మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి,  ఎవరిని తప్పించాలనే విషయం పైన అధిష్టానం పెద్దలతో చర్చించారు.  ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, మరో పదకొండు మంది మంత్రులు ఉన్నారు.

  అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతున్నా,  ఏదో ఒక అడ్డంకి ఏర్పడడంతో అది వాయిదా పడుతూ వస్తోంది.జమ్ము కాశ్మీర్ , హర్యానా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు బిజీగా ఉండడంతో, తెలంగాణ క్యాబినెట్ విస్తరణ వాయిదా వేశారు .

అయితే ఇప్పుడు ఆ ఎన్నికలు పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి( Delhi ) వెళ్తున్నారు.రేవంత్ రెడ్డి తో పాటు,  డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,( Minister Uttam Kumar Reddy ) శ్రీధర్ బాబు,( Minister Sridhar Babu )  టి.పేసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు,  ఇతర ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్తుండడంతో , క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన వ్యవహారాన్ని తేల్చుకునేందుకే వీరంతా ఢిల్లీకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ పైనా, అధిష్టానం పెద్దలతోనూ చర్చించనున్నట్లు సమాచారం.

Telugu Aicc, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi, Telanganacm, Telangana,

ఈ విస్తరణలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.  తాజాగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్( PCC Chief Mahesh Kumar Goud ) కూడా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.క్యాబినెట్ విస్తరణ ఇక ఎంతో దూరంలో లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.ఇక మంత్రివర్గంలో స్థానం కోసం సీనియర్ నేతలు చాలామంది పోటీ పడుతున్నారు.  అదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు తో పాటు,  వివేక్ , వినోద్ లు ప్రయత్నిస్తున్నారు .

Telugu Aicc, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi, Telanganacm, Telangana,

దీంతో వారికి పెట్టేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు మంత్రి పదవిని ఆశిస్తున్నాను అని మీడియా ముందు వచ్చి మరి చెప్పారు.మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.ప్రేమ్ సాగర్ రావు కి కౌంటర్ గా వివేక్ , వినోద్ సోదరులు ఢిల్లీ స్థాయిలో మంత్రి పదవి కోసం లాభియింగ్ చేస్తున్నారట.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గెలిచిన సీనియర్ నాయకుల్లో మాజీ మంత్రి,  ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో అవకాశం దొరుకతుందని ధీమాగా ఉన్నారు.ఇదే జిల్లా నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube