జరిగేది 'అఖండ' తాండవం అంటున్న బాలకృష్ణ.. వీడియో వైరల్

తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.‘మాస్ ఆఫ్ ద గాడ్’ గా బాలకృష్ణ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.బాలయ్య – బోయపాటి శీను దర్శకత్వంలో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కించిన సంగతి అందరికి విదితమే.ఆ సినిమాలన్నీ భారీ విజయాల్ని అందుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో మరోమారు బోయపాటి( Boyapati Srinu ) దర్శకత్వంలో బాలయ్య హీరోగా నాలుగవ సినిమాగా ‘అఖండ 2( Akhanda 2 )’ రాబోతుంది.ఈ సినిమా అఖండ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతోంది.

 Balakrishna Akhanda 2 Movie Dialogue Movie Opening Ceremony, Balakrishna ,-TeluguStop.com

ఇకపోతే, నేడు (బుధవారం) బాలకృష్ణ కూతుర్లు బ్రాహ్మణి, తేజస్విని చేతుల మీదుగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు.ముందుగా బ్రాహ్మణి క్లాప్ కొట్టగా, తేజస్విని కెమెరా ఆన్ చేసినట్లు తెలుస్తుంది.ఈ పూజా కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా బాలయ్య బాబు డైలాగు చెప్పి అందర్నీ ఆకట్టుకున్నాడు.అఖండ 2 సినిమాలోని ఒక డైలాగును బాలయ్య బాబు చెప్పారు.అదేంటంటే.“ఈ నేల అసురుడిది కాదు.ఈశ్వరుడిది పరమేశ్వరుడిది.కాదని, తాకితే జరిగేది తాండవం ‘అఖండ తాండవం’” అంటూ బాలయ్య ( Balakrishna )అదరగొట్టేశాడు.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.

ఆ వీడియోలో థమన్ బీజీఎంలో డైలాగ్ ఎలా ఉండబోతుందో ఒక్కసారిగా ఊహకు అందడం లేదని అభిమానులు అంటున్నారు.ఇక అఖండ 2 సినిమా షూటింగ్ మొదలవ్వకముందుకే అభిమానులలో భారీ అంచనాలు మొదలయ్యాయి.అంతేకాకుండా, ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి మీడియాతో మాట్లాడుతూ.బాలయ్యను ఉద్దేశిస్తూ అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా హీరో ఖచ్చితంగా అవుతారని తెలిపారు.

ఇక ఈ సినిమాకు థమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.ఇక ఈ సినిమాకు సి.రామప్రసాద్ కెమెరామెన్ గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్‌గా పని చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube