కెనడా దూకుడు , భారత్‌పై అమెరికా ఒత్తిడి.. పన్నూన్ కేసును తవ్వుతోన్న అగ్రరాజ్యం

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసు విషయంలో కెనడా ప్రభుత్వం( Canada Government ) దూకుడుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.ఏకంగా కెనడాలో భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మనే( Sanjay Kumar Verma ) అనుమానితుల జాబితాలో చేర్చడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్నాయి.

 Us Seeks Action Against Indian Police Officer In Plot To Kill Gurpatwant Pannun-TeluguStop.com

భారత్ – కెనడాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించాయి.మరోవైపు భారత్‌పై ఆంక్షలు విధించేలా ట్రూడో ఆలోచన చేస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మరో ఖలిస్తాన్ వేర్పాటువాది , సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్( Gurpatwant Singh Pannun ) హత్యకు కుట్ర కేసును అమెరికా( America ) తవ్వడం మొదలుపెట్టింది.అంతేకాదు.

జస్టిన్ ట్రూడోకు మద్ధతుగా మాట్లాడుతోంది.నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తుకు సహకరించాలని న్యూఢిల్లీని కోరింది.

భారత్‌పై కెనడా చేస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్( Matthew Miller ) తెలిపారు.

Telugu America, Canada, Deputynational, Gurpatwantsingh, Hardeepsingh, Indian, J

ఈ సంగతి పక్కనబెడితే.గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర కేసును అమెరికా బయటికి తీసింది.పన్నూన్‌ను హతమార్చేందుకు యత్నించిన కేసులో అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపిన భారత పోలీస్ అధికారిపై విచారణ జరపాలని అగ్రరాజ్యం కోరుతోంది.

కొన్ని వ్యక్తుల కార్యకలాపాలను పరిశోధించడానికి ఏర్పాటు చేసిన డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)తో కూడిన భారత విచారణ కమిటీ వాషింగ్టన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Telugu America, Canada, Deputynational, Gurpatwantsingh, Hardeepsingh, Indian, J

అమెరికా న్యాయశాఖ సీసీ 1గా పేర్కొన్న భారత ప్రభుత్వ ఉద్యోగి ఉత్తర అమెరికాలో విధులు నిర్వర్తించాడని, ఇప్పుడు అతను భారత్‌లో ఉన్నాడని తెలిపింది.ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ కోర్ట్.( US Federal Court ) భారత ప్రభుత్వం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, రా మాజీ చీఫ్ సమంత్ గోయెల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తా తదితరులకు సమన్లు జారీ చేసింది.

పన్నూన్ సహా నలుగురు సిక్కు వేర్పాటువాదులను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లుగా గుప్తాపై గతేడాది నవంబర్‌లో యూఎస్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube