రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ ఏర్పడితే ప్రజల ప్రాణాలకు ముప్పు

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రజా ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని దెబ్బతీసే సిమెంటు కాలుష్య పరిశ్రమకు రామన్నపేట మండల ప్రాంత ప్రజలు బలికావద్దని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్రాంత ఆచార్యులు ఏ.రామచంద్రయ్య పిలుపునిచ్చారు.

 Cement Industry Is Established In Ramannapet There Will Be A Threat To Peoples L-TeluguStop.com

రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన ఆదాని గ్రూపు అంబుజా సిమెంటు పరిశ్రమలు వ్యతిరేకిస్తూ స్థానిక రహదారి బంగ్లాలో అఖిలపక్ష పార్టీలు పర్యావరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సదస్సుకు మండల వ్యాప్తంగా 600 మంది వివిధ పార్టీలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దుమ్ము, దూలీతో పరిసరాలను ప్రభావితం చేస్తూ వాయు,శబ్ద, జల కాలుష్యం చేసి ప్రజా జీవన వ్యవస్థను స్తంభింపజేసే సిమెంటు కాలుష్య పరిశ్రమను ముందుగానే పసిగట్టి రాజకీయాల కతీతంగా పోరాడాలన్నారు.సిమెంట్ లో కలిపే రసాయనాల మూలంగా ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.

పరిశ్రమ ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందని ప్రచారం అశాస్త్రీయం మండల ప్రాంత గ్రామాల అభివృద్ధి తిరోగమనంలో ఉంటుంది.

పచ్చని పంటల్లో మంటలు పెట్టి భూముల ధరలు తగ్గించే కుట్రకు బలి కావద్దు.

అంబుజా సిమెంటు పరిశ్రమ నుంచి విడుదలయ్యే వ్యర్ధ రసాయనాలైన జిప్సం,స్లాగ్, క్లింకేర్,బొగ్గు,సల్ఫర్,డయాక్సైడ్,నైట్రోజన్ ఆక్సైడ్ వంటి ప్రతిరోజు గాలిలో కలవడంతో ప్రాణాంతక ఊపిరితిత్తుల శ్వాసకోశ వ్యాధులు సంభవించే అవకాశం ఉన్నది.చర్మ రోగాలు,గర్భస్రావాలు, చిన్నపిల్లలు ఎదుగుదల లేకపోవడం,కంటిచూపు మందగించడం,అంగవైకల్యం వంటి వ్యాధులు ప్రబలుతాయి,పశు సంపద అయిన గొర్రెలు,మేకలు, చాపలు మరియు తాటికల్లు, పశుగ్రాసం నీరు కలుషితమై గ్రామీణ వృత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది.

ప్రజా ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని దెబ్బతీసే కాలుష్య పరిశ్రమకు వ్యతిరేకంగా ముక్తకంఠంగా పోరాడి భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రతిఘటించకపోతే భవిష్యత్తు లేదు పట్టణ ప్రాంత అభివృద్ధి రాష్ట్ర కార్యదర్శి డీ.

జి నరసింహారావు అన్నారు.ఆదానికి కాలుష్య పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై ఉద్యమించకుంటే భవిష్యత్ తరాల ప్రశ్నార్థకంగా మారుతాయి.

పట్టణ ప్రాంతాల అభివృద్ధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి నరసింహారావు అన్నారు.సిమెంట్ పరిశ్రమలు నెలకొల్పిన ప్రాంతాల్లో పరిసర గ్రామాలు ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదని ప్రజలు పోరాడకుండా నిర్బంధాలు మోపుతున్నారని దేశాన్ని ప్రభావితం చేసే పెట్టుబడిదారుడు గ్రామీణ ప్రాంతాల్లో చొరబడి విస్తృతపరచుకొని గ్రామాలను స్మశానాలుగా మార్చే ప్రమాదం ఉందని తెలియజేశారు.పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణ రోజున వేలాదిగా ప్రజలు తరలాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు.23న జరిగే ప్రజాభిప్రాయ సేకరణకు జరగకుండా పరిశ్రమ ఏర్పాటు చెయకుండా అన్ని గ్రామాల్లో రాజకీయ పార్టీలు ఐక్యంగా ప్రజలను తరలించాలని తీర్మానించారు.

దశలవారీగా పోరాట కార్యాచరణను రూపొందించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి యండి జహంగీర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి,రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి,జల్లెల పెంటయ్య, బీఆర్ఎస్ మండల కార్యదర్శి పోచబోయిన మల్లేశం,బీజేపీ మండల అధ్యక్షుడు పల్లపు దుర్గయ్య,సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరి నర్సింహ, టిడిపి నాయకులు ఫజల్ బేగ్, డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్ల నరేందర్,బీఎస్పీ నాయకుడు గూని రాజు,అఖిలపక్షం నాయకులు గంగుల రాజిరెడ్డి, బొడ్డుపల్లి వెంకటేశం,యండి రెహాన్,జినుకల ప్రభాకర్, చేగురి గణేష్,మహేష్,గోదాసు పృద్విరాజ్,కందుల హనుమంతు,జమీరొద్దీన్,నంద్యాల బిక్షం రెడ్డి, నాగటి ఉపేందర్,సాల్వేరు అశోక్, కడారి స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube