చిరంజీవి అలా చేయడం నాకు నచ్చలేదు.. దర్శకుడు రాజమౌళి కీలక వ్యాఖ్యలు?

దర్శకధీరుడు రాజమౌళికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.అయితే రాజమౌళి ఫేవరెట్ హీరోలు మాత్రం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు కావడం గమనార్హం.

 Rajamouli Chiranjeevi Kodama Simham Movie Ram Charan Magadheera, Interesting Fac-TeluguStop.com

మెగా హీరో చిరంజీవి దర్శకధీరుడు రాజమౌళి ఫేవరెట్ హీరోలలో ఒకరు.స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి తన ప్రతిభతో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.

అయితే తాజాగా రాజమౌళి కొదమసింహం సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా విషయంలో చిరంజీవి చేసిన పని నచ్చలేదని చెప్పారు.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ జక్కన్న ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

కొదమసింహం మూవీలో ఒక సన్నివేశం తనకు నచ్చలేదని రాజమౌళి తన మనస్సులోని బాధను బయటపెట్టారు.కొదమసింహం సినిమాలోని ఒక సీన్ లో చిరంజీవిని ఇసుకలో కప్పెట్టేసి తలను మాత్రమే బయట ఉంచుతారని ఆ సమయంలో గుర్రం వచ్చి చిరంజీవిని రక్షిస్తుందని అయితే చిరంజీవి బయటకు వచ్చిన తర్వాత గుర్రంను పట్టించుకోరని రాజమౌళి అన్నారు.

ప్రాణాలను కాపాడిన గుర్రానికి చిరంజీవి థ్యాంక్స్ కూడా చెప్పలేదని ఆ సీన్ లో ఎమోషన్ పండకపోవడంతో మైండ్ లో ఆ సీన్ రిజిష్టర్ అయిందని రాజమౌళి కామెంట్లు చేశారు.ఆ సీన్ ను స్పూర్తిగా తీసుకొని మగధీరలో గుర్రం సీన్ ను రాసుకున్నామని రాజమౌళి చెప్పుకొచ్చారు.

మగధీర మూవీలో చరణ్, గుర్రం మధ్య వచ్చే సీన్లు అద్భుతంగా పండాయని గుర్రాన్ని రామ్ చరణ్ స్నేహితుడిలా భావించేలా సీన్లు, డైలాగ్స్ ను తాను రాసుకున్నానని రాజమౌళి పేర్కొన్నారు.

Telugu Magadheera, Rajamouli, Ram Charan-Movie

అయితే ఆ సినిమా విషయంలో చిరంజీవి తప్పు ఉండదని దర్శకుడు ఏది చెబితే చిరంజీవి ఆ పని చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అయితే రాజమౌళి చిన్నచిన్న సీన్ల విషయంలో కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టే ఆయన సినిమాలు ఈ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంటున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube