ఇటీవల కాలంలో మూవీ మేకర్స్ కి కాపీ అన్న పదం పెద్ద తలనొప్పిగా మారిపోయింది.సినిమాలో పాటలను సన్నివేశాలను పోస్టర్లను ఇలా ప్రతి ఒక్కటి ఇతర సినిమాలతో పోలుస్తూ కాపీ కొట్టారు వార్తలను సృష్టిస్తున్నారు.
చిన్నాచితక డైరెక్టర్ ల నుంచి స్టార్ డైరెక్టర్ రాజమౌళి వరకు ఈ కాపీ వాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.తాజాగా విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) సినిమాకు కూడా ఈ కాపీ వివాదం ఎదురయ్యింది.గౌతమ్ తిన్ననూరి( Gautam Tinnanuri ) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంబంధించిన పోస్టర్ ని తాజాగా విడుదల చేశారు మూవీ మేకర్స్.వీడీ12( VD12 ) పేరుతో రూపొందుతున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.
అయితే ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదంగా మారింది.ఆ పోస్టర్ ని చూసిన నెటిజన్స్ కాపీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ హల్చల్ చేస్తున్నారు.2012లో విడుదల అయిన హాలీవుడ్ మూవీ ఆర్గో సినిమా( Argo Movie ) పోస్టర్‌ని పోలి ఉండటంతో ఈ వివాదం రాజుకుంది.విజయ్ దేవరకొండకు సంబంధించిన ఫోటోని అలాగే ఆర్గో సినిమాకు సంబంధించిన పోస్టర్ని పక్కపక్కన పెట్టి కాపీ కొట్టారు అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కాగా విజయ్ దేవరకొండ నటించబోతున్న సినిమా పోస్టర్ కాపీ వివాదంపై చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు.
ఆయన దీనిపై వివరణ ఇచ్చారు.ఇది యాధృచ్చికంగా జరిగిందని తెలిపారు.ఆర్గో సినిమా పోస్టర్‌ని తాము కాపీ కొట్టలేదని, స్పై థ్రిల్లర్ చిత్రాల పోస్టర్లు చాలా వరకు ఇలానే ఉంటాయని తెలిపారు.
పీరియాడికల్ స్పై థ్రిల్లర్ కావడంతో పేపర్‌ని కట్ చేసినట్టుగా పెట్టి పోస్టర్ డిజైన్ చేయాలనుకున్నాం, కానీ అది అనుకోకుండా ఆర్గో సినిమా పోస్టర్‌లా మారిపోయింది అని తెలిపారు.పోస్టర్ ఇలా ఉందంటే దాని వెనకాల ఏం జరిగింది,
ఎందుకు ఇలా డిజైన్ చేయాల్సిందో తెలుసుకోవాలని, బేస్ లేని వార్తలకు ప్రలోభాలకు గురై జడ్జ్ మెంట్ ఇవ్వొద్దని తెలిపారు నాగవంశీ.అలాగే వీడీ12 సినిమా పోలిన కొన్ని సినిమాల పోస్టర్లని పంచుకున్నారు నాగవంశీ.అయితే నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చినప్పటికీ నెటిజన్స్ మాత్రం ఈ సినిమా పోస్టర్ కాపీని అంటూ ట్రోల్స్ చేస్తూ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.
నిర్మాత క్లారిటీ ఇచ్చినప్పటికీ వదలడం లేదు.మరి ఈ కాపీ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి మరి.