బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం పఠాన్.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది.
ప్రేక్షకులు అలాగే పలువురు సెలబ్రిటీలు చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
అంతే కాకుండా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ చాలా కాలం తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.తాజాగా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఇకపోతే ఈ సినిమాపై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ స్పందిస్తూ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించారు. పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.ఇందులో సల్మాన్ ఖాన్,షారుఖ్ ఖాన్ సన్నివేశాలు వచ్చినప్పుడు తాను నిలుచుని చప్పట్లు కొట్టినట్టు తెలిపారు.
చివరిసారిగా సినిమాల్లో నేను ఇంత సరదాగా గడిపిన సందర్భాలు నాకు గుర్తులేవు.ఇది అతి పెద్ద బ్లాక్ బస్టర్ మాత్రమే.మెగా అనే పదం దీనికి సరిగ్గా సరిపోతుంది.
షారుక్ ఖాన్ లుక్స్ తేజస్సు,సూపర్ స్టార్ డమ్, నటన అద్భుతమైన ఏజెంట్ గా దీపికా పదుకొనే, ప్రతి నాయకుడిగా జాన్ అబ్రహం కూడా అదరగొట్టేశారు అని తెలిపాడు కరణ్ జోహార్. ఇక కింగ్ గురించి చెప్పాలి అంటే ఆయన ఎక్కడికి పోలేదు.బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి సరైన సమయం కోసం వేచి చూశాడు.
ఇప్పటివరకు మీరు ఎన్నో విమర్శలను బహిష్కరణలను ఎదుర్కొనే ఉండవచ్చు.కానీ మీ దారిలో మీరు వచ్చినప్పుడు ఆ మార్గంలో ఎవరు నిలబడలేరు అనేది నిజం అంటూ ప్రశంసలు కురిపించారు కరణ్ జోహార్.