కాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో టిడిపి సత్తా చాటుకుంది.మొత్తం 20 వార్డులకు గాను టిడిపి 13 వార్డుల్లో విజయం సాధించగా, వైసిపి 7 వార్డుల్లో పాగా వేసింది.
దీంతో దర్శి నగర పంచాయతీ పీఠాం టీడీపీ వంశం అయింది నూతనంగా ఏర్పడ్డ దర్శి నగర పంచాయతీ చైర్మన్ పదవి టిడిపికి దక్కడంతో స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు ఇది భారీ ఎదురు దెబ్బగా మారింది రెండున్నర సంవత్సరాల పాలన అనంతరం కూడా దర్శి చైర్మన్ పదవి వైసీపీకి కాకుండా టిడిపికే దక్కడం తో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మరియు ఆయన వర్గీయులు తీవ్ర నిరాశ చెందారు.
దర్శి నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ మీడియాతో మాట్లాడుతూ.
ప్రజలు ఎప్పుడూ టిడిపి వైపు ఉన్నారని,ఎవరు ఎన్ని ప్రలోభాలకు పాల్పడ్డ వాటికి లొంగకుండా దర్శి ప్రజలు టిడిపిని గెలిపించారన్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే మరియు ఆయన వర్గీయులు దాడులకు పాల్పడి భయబ్రాంతులకు గురి చేసినా కూడా టిడిపి కే పట్టం కట్టారని అన్నారు టిడిపినీ గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు
.