ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో శత్రుత్వం మొదలైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో శత్రుత్వం మొదలైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.బుధవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశాననే పోలీసులు తనను ఇబ్బంది పెట్టారన్నారు.

 Prajashanthi Party President Ka Pal Said That The Enmity Has Started With Ap Chi-TeluguStop.com

విద్యార్థులు తనను సీఎం అని నినాదాలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారని, ఎంఆర్‌పల్లి సీఐ సురేందర్రెడ్డి దురుసుగా వ్యవహరించారన్నారు.సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

మూడు రోజుల్లో సీఎం జగన్ స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తానన్నారు.జగన్ అక్రమాస్తుల విషయంలో.

సీబీఐ డైరెక్టర్తో మాట్లాడానని కేఏ పాల్ అన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని కేఏ పాల్ అన్నారు.

కోమటిరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నానన్నారు.రాజగోపాల్ ఎప్పటి నుంచో బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని, కాంగ్రెస్ పూర్తిగా పతనమైన పార్టీ అని వ్యాఖ్యానించారు.

రాజగోపాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తాను గెలిపిస్తానన్నారు.బీజేపీలో చేరితే రాజగోపాల్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు.

ప్రజాశాంతి పార్టీలో చేరితే 60 శాతం ఓట్లు రాజగోపాల్కే పడతాయని కేఏ పాల్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube