యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) లైనప్ లో కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి.మరి ఈ భారీ ప్రాజెక్టుల్లో భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియన్ మూవీ ఏది అంటే ”సలార్’‘( Salaar ) అనే చెప్పాలి.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.ఈ సినిమాపై ఇప్పటికే భారీ హోప్స్ నెలకొన్నాయి.
కేజిఎఫ్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినా నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో నెక్స్ట్ ఈయన చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.సెప్టెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్ని ఊహించని కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేశారు.
ఇక మేకర్స్ క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిసిందే.
ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామని తెలిపారు.అయితే రిలీజ్ పై క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తుందేమో అని అంతా అనుకున్నారు.నవంబర్ వచ్చింది.
అయినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదని మేకర్స్ పై ఫ్యాన్స్ బీభత్సమైన కోపంతో ఉన్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించి అప్డేట్ తెలుస్తుంది.ఈ సినిమా ట్రైలర్ ను నవంబర్ చివరి నాటికీ లేదంటే డిసెంబర్ మొదటి వారంలో కానీ రిలీజ్ చేయనున్నారట.ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ అతి త్వరలోనే క్లారిటీ రానుంది.
కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.
అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.