బాలకృష్ణపై పోసాని సంచలన కామెంట్స్... ఇతన్ని ట్రోల్ చేస్తారా

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో బాలకృష్ణ వాఖ్యలు సంచలనంగా మారాయి.ఇండస్ట్రీలో భూములు పంచుకోవడానికి కేసీఆర్ తో పెద్దలందరూ కలిసారని తీవ్ర వాఖ్యలు చేసారు.

 Posani Comments On Balakrishna, Tollywood, Ap Politics, Ys Jagan, Ntr, Tdp, Ysrc-TeluguStop.com

దీనిపై మెగా బ్రదర్ నాగబాబు బాలకృష్ణకి చురకలు అంటించారు.అయితే నాగబాబు చేసిన వాఖ్యలని ఒక వర్గం మీడియా హైలెట్ చేసి పెద్ద చర్చలు పెట్టింది.

కొంత మంది బాలయ్య వాఖ్యలని తప్పు పడితే, కొంత ఒక వర్గం వాళ్ళు, బాలకృష్ణ అభిమానులు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడారు.సోషల్ మీడియాలో కూడా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బాలయ్య బాబు అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు.

ఈ వివాదం టాలీవుడ్ లో మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుంది.అలాగే రాజకీయాలపై వైసీపీ ప్రభుత్వం, జగన్ ని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వాఖ్యలు ఆ పార్టీ నేతలకి మంట పుట్టించాయి.

ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ వాఖ్యలపై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళీ స్పందించాడు.జగన్ ఏడాదిలో దిగిపోతాడని, అలాగే ఇండస్ట్రీలో భూములు పంచుకుంటున్నారు అంటూ బాలయ్య చేసిన వాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకి పోసాని కౌంటర్ వేశాడు.

బాలకృష్ణకి కోపం వచ్చినంత మాత్రాన సమాజానికి నష్టమేమీ లేదని, అసలు ఎవరికీ కూడా నష్టం ఉండదని చెప్పాడు.అలాగే బాలయ్య కోపం క్షణికం అని అతని మాటలని, విమర్శలని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసమే లేదని పోసాని తేల్చేసారు.

అదే సమయంలో బాలకృష్ణ హానెస్ట్ వ్యక్తి అని కితాబు కూడా ఇచ్చారు.బాలయ్య అంటే జగన్ ఏడాదిలో దిగిపోరని, వెన్నుపోటు పొడిపించుకోడానికి జగన్ ఏమీ ఎన్టీఆర్ కాదని వాఖ్యానించారు.

మరి పోసాని వాఖ్యలు ఓ విధంగా బాలకృష్ణని తీసిపారేసే విధంగా ఉన్నాయి.మరి ఈ వాఖ్యలపై బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube